- Advertisement -
కొడంగల్: కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత రాష్ట్ర ప్రజల్లో చైతన్యం వచ్చింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ను ఓడించాలని కుట్ర పన్నుతున్నాయి. అందులో భాగమే నాగార్జున సాగర్ వివాదం’ అని అన్నారు. కొడంగల్లో రేవంత్ రెడ్డి తన సతీమణి, కూతురితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఆయన ఇంట్లో గోపూజ చేశారు.
- Advertisement -