- Advertisement -
ఈ సారి ఫాంహౌస్ లు టార్గెట్…
This time farmhouses are the target...
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (న్యూస్ పల్స్)
విశ్వనగరం హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్)ను ఏర్పాటు చేశారు. పదేళ్లుగా హైదరాబాద్ ఏటా నీటమునుగుతోంది. చిన్న వర్షం పడినా రోడ్లు జలమయమవుతున్నాయి. లోతట్లు ప్రాంతాలు నీటమునుగుతున్నాయి. ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. ఈ తరుణంలో సీఎం చేవంత్‌రెడ్డి హైదరాబాద్ వరద సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. ఏళ్లుగా ఆక్రమణకు గురైన చెరువులు, కుంటలు, నాలాలను చెర విడిపించడమే లక్ష్యంగా హైడ్రా ఏర్పాటు చేశారు. నెల రోజులుగా హైడ్రా తన పని మొదలు పెట్టింది. హైడ్రా కమిషనర్‌గా నియమితులైన రంగనాథ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఎవరి ఒత్తిడులకు తలొగ్గకుండా తన పని తాన చేసుకుపోతున్నారు. కోర్టులు కూడా చట్ట ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా బుల్డోజర్లు ఎప్పుడు ఎవరిపైకి వెళ్లాయో అన్న టెన్షన్ ఆక్రమణదారులను ఆందోళనకు గురిచేస్తోంది. గండిపేట జలాశయంలోని పలు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. పలువురు ఎమ్మెల్యేలు, వ్యాపార వేత్తల ఫామ్‌హౌస్‌లు, హోటళ్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు నేలమట్టం చేశారు. తాజాగా.. హిమాయత్ సాగర్ జలాశయంలోని నిర్మాణాలపై ఫోకస్ పెట్టారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే అనేకం వందల అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. హైడ్రాకు సీఎం రేవంత్ రెడ్డి స్వేచ్ఛ ఇవ్వడంతో అధికారులు ఎక్కడా తగ్గటం లేదు. ఎవ్వరినీ వదలకుండా కూల్చివేతల పర్వం కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి నివాసానికి కూడా నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని 13 చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిర్మాణాలపై చర్యలు తీసుకుంటున్నారు. దీంతో హైడ్రా తర్వాత టార్గెట్ హిమాయత్ సాగర్ జలాశయంగా తెలుస్తోంది. జలాశయంలోని నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను గుర్తించే ప్రక్రియను జలమండలి, రెవెన్యూ అధికారులు చేపట్టారు. మొదటి దశలో కొందరు ప్రముఖుల ఫామ్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతోపాటు ఇతర పార్టీలు, ప్రముఖుల బంగ్లాలు జలాశయం ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నట్లు తెలిసింది. వాటిల్లో పది భారీ నిర్మాణాలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. అధికార పార్టీకి చెందిన ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే ఫాంహౌస్‌తోపాటు మరికొందరు నేతల ఫామ్‌హౌస్‌లు తెరపైకి వచ్చాయి. వచ్చే సోమవారానికి ఈ కట్టడాలపై నివేదక పూర్తి చేసి కూల్చివేతలకు సిద్ధమైనట్లు తెలిసింది.హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో శుక్రవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన పలు కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని తేలటంతో నేడు హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో స్పందించిన యంత్రాంగం అక్కడి కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి.. కూల్చివేతలు చేపట్టింది. ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
- Advertisement -