Tuesday, March 3, 2026

ఈ సారి భారీ ఎండలు…

- Advertisement -

ఈ సారి భారీ ఎండలు…
హైదరాబాద్, మార్చి 2

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి మే నెల వరకు (ఎంఏఎం సీజన్… మార్చి-ఏప్రిల్-మే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండనుందని స్పష్టం చేసింది. సాధారణంగా వేసవిలో ఉండే ఉష్ణోగ్రతల కంటే ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా వడగాల్పుల రోజులు గణనీయంగా పెరుగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో 2001 తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదు కావడం, చలి తీవ్రత తక్కువగా ఉండటం రాబోయే కఠిన వేసవికి సంకేతాలని అధికారులు విశ్లేషిస్తున్నారు.ఈ వేసవిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు వీచే రోజుల సంఖ్య 3 నుంచి 15 రోజుల వరకు, కొన్ని ప్రాంతాల్లో అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని ఉత్తర జిల్లాలపై సూర్యుడు నిప్పులు చెరిగే ప్రమాదం ఉంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, సిద్దిపేట్, హనుమకొండ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లోనూ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల పైనే నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్సో న్యూట్రల్ పరిస్థితులు ఏర్పడుతుండటంతో వాతావరణంలో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఆరోగ్య భద్రత ముఖ్యం
తీవ్రమైన ఎండల కారణంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు బయట తిరగడం తగ్గించుకోవాలని ఐఎండీ సూచించింది. పెరిగే ఉష్ణోగ్రతలు ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా నీటి వనరులు, విద్యుత్ డిమాండ్పైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక సంస్థలు నీటి ఎద్దడి తలెత్తకుండా, వడదెబ్బ మరణాలు సంభవించకుండా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.మరోవైపు పొరుగున ఉన్న తమిళనాడులోనూ పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. అక్కడ కూడా మార్చి నుంచి మే వరకు మూడు నెలల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా ఆ రాష్ట్ర ఉత్తర జిల్లాల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కానున్నాయి. అయితే, కోమరిన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల ప్రాంతాల్లోని జిల్లాల్లో మాత్రం రాబోయే రెండు నుంచి ఐదు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇది స్థానికులకు కాస్త ఉపశమనం కలిగించవచ్చని వాతావరణ కేంద్రం పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం పొడి వాతావరణంతో పాటు, చెన్నై వంటి నగరాల్లో ఉదయం వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్