Wednesday, September 18, 2024

గుచ్చుకుంటున్న గులాబీ ముళ్లు… సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న కేసీఆర్

- Advertisement -

గుచ్చుకుంటున్న గులాబీ ముళ్లు…
సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న కేసీఆర్
వరంగల్, మే 3, 
భారత రాష్ట్ర సమితి.. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి బలై అధికారం కోల్పోయిన పార్టీ.. కానీ ఓటమి తర్వాత నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కనీసం విపక్ష హోదానైనా సరిగ్గా వెలగబెడుతుందా అంటే అదీ లేదు.. లేని పంచాయితీలను తెరపైకి తీసుకొస్తూ ఎక్కడికక్కడ పరవు తీసుకుంటోంది. ఈ మాట అనేందుకు అనేక కారణాలు ఉన్నాయి.
ఇది వచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. రైమింగ్‌ బాగుంది కదా అని బీఆర్ఎస్‌ నేతలు తెగ వాడేశారు. ప్రజల్లోకి ఈజీగా వెళుతుంది అనుకున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు అయితే రోడ్డేక్కారు. కానీ రైతుల నుంచి అనుకున్నంత రియాక్షన్ రాలేదు. ప్రాజెక్టుల్లో నీళ్లు లేవన్నారు.దీనికి కాంగ్రెస్ నేతలు దిమ్మతిరిగే జవాబులు ఇచ్చారు. అటు రైతులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో హరీష్‌రావు వెనక్కి తగ్గారు. హరీష్‌రావు తర్వాత ఇదే నినాదంతో బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఏకంగా పొలంబాట అనే ప్రొగ్రామ్‌ను డిజైన్ చేశారు. మంది, మార్బలంతో జిల్లాల పర్యటనకు వెళ్లారు. తెలంగాణలో నీటి ఎద్దడి వీపరీతంగా ఉందని పాత పాటే పాడారు. అయితే ఎండిన పొలాల పక్కనే పచ్చని పొలాలు కనిపించడంతో ఆయన ప్రయాస మొత్తం వృథా అయ్యింది. ఇది బీఆర్‌ఎస్‌ వేసుకున్న సెల్ఫ్‌ గోల్. ఇక కేసీఆర్ ఈ మధ్యనే ఎక్స్‌లో అకౌంట్ ఓపెన్ చేశారు. రోజుకో ట్వీట్ పెడుతున్నారు. అయితే ఆయన పెట్టిన మూడో ట్వీటే ఆయనకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ ట్వీట్‌లో ఆయన ఏమన్నారంటే.. తాను మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌ ఇంట్లో ఉన్నప్పుడు కరెంట్ పోయిందని.. టోటల్ స్టేట్‌వైడ్ ఇదే సిట్యూవేషన్ ఉందంటూ ట్వీట్ చేశారు. దీనిపై తెలంగాణ విద్యుత్‌ శాఖ వెంటనే క్లారిటీ ఇచ్చింది.అసలు పవర్‌ కట్స్‌ లేనే లేవని ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది.. దీంతో ఆయన ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని సిట్యూవేషన్‌లో పడిపోయారు. తండ్రి, పార్టీ అధినేత ఏ రూట్‌లో అయితే నడుస్తున్నారో.. ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా అదే రూట్‌లో నడుస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో సదుపాయాలు లేవంటూ అటు కేసీఆర్, ఇటు కేటీఆర్ ట్వీట్స్ చేశారు. ప్రభుత్వ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్స్‌ వైరల్‌ చేస్తున్నారంటూ అటాక్ చేశారు. ఫేక్ సర్క్యూలర్స్‌ పోస్ట్ చేసే స్థాయి రేవంత్ దిగజారిపోయారంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు. కాంగ్రెస్‌ వచ్చాకే హాస్టల్స్‌కు సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఓ ప్రొపగాండను క్రియేట్ చేశారు. కానీ చివరికి ఏమైంది.. కాంగ్రెస్ ఇచ్చిన కౌంటర్స్‌తో ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితి.. కేసీఆర్‌ను గోబెల్స్‌తో పొలుస్తూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.అంతేకాదు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను రిలీజ్ చేశారు. దీంతో ఏమైంది.. ? తప్పుడు డాక్యుమెంట్స్‌ క్రియేట్ చేసిన బీఆర్ఎస్‌ నేత క్రిశాంక్‌తో పాటు పలువురు నేతలపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఇది మరో సెల్ఫ్‌ గోల్. ఇక వీటన్నింటికంటే హైలేట్ హరీష్‌రావు రాజీనామా ఎపిసోడ్.. రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానంటూ హరీష్‌రావు చేసిన సవాల్‌ను స్వీకరించారు సీఎం రేవంత్ రెడ్డి.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి చూపిస్తానంటూ ప్రజల ముందే ప్రకటించారు.. దీంతో హరీష్‌రావు డైలమాలో పడిపోయారు. ఎందుకంటే బీఆర్ఎస్‌ నేతలు ఈ ప్రకటనను అస్సలు ఊహించలేదనే చెప్పాలి. సింపుల్‌గా చెప్పాలంటే వారి పరిస్థితి ముందుకు వెళ్తే.. వెనక్కి వెళితే గొయ్యి అన్నట్టుగా తయారైంది.అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లిన హరీష్‌రావు రాజీనామా అంటూ ఓ లేఖను మీడియాకు చూపించారు.. రుణమాఫీతో పాటు అన్ని గ్యారెంటీలను అమలు చేయాలంటూ ఓ మెలిక పెట్టారు.. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయకుండా మాములు లేఖ రాశారు. తన రాజీడ్రామాతో పొలిటికల్‌ మైలేజ్‌ వస్తుందనుకున్న హరీష్‌రావు సంగతి అందరికీ తెలిసిపోవడంతో ఆయనకు ఆయనే సెల్ఫ్‌గోల్ వేసుకున్నట్టైంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలు ఉన్నాయి.ఈ ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ఎలాగైనా గెలవాలన్న కసి కనిపిస్తుంది బీఆర్ఎస్‌ నేతల్లో కానీ ప్రస్తుతం రాష్ట్రంలో చెప్పుకోగదగ్గ సమస్యలు లేవు.. ఉన్నా.. వాటిని ఎందుకు తీర్చలేదని కాంగ్రెస్‌ను ప్రజలు ప్రశ్నించలేని పరిస్థితి. ఎందుకంటే అధికారం చేపట్టి నాలుగు నెలలు కూడా కాలేదు. దీంతో బీఆర్ఎస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. లేని సమస్యలను సృష్టించి ప్రజలను మిస్‌ లీడ్ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ సర్కార్‌ను బద్నాం చేయాలని చూస్తున్నారు. కానీ ప్రతి విషయంలో సెల్ఫ్‌ గోల్ వేసుకుంటూ వారికి వారే బద్నామ్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తిస్తారా? తీరు మార్చుకుంటారా? అనేది చూడాలి

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్