వేల మంది అమరులైంది ఎవరి వల్ల ?
కేటీఆర్
హైదరాబాద్
తెలంగాణలో వేల మంది అమరులైంది. అమరుల స్తూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వల్ల.? అని కేటీఆర్ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా ఆయన పలు ప్రశ్నలు సంధించారు. 1952లోనే ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్థులపై సిటీ కళాశాల వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా.? 1969-71 తొలిదశ ఉద్యమంలో 370 మందిని కాల్చిచంపింది ఎవరు.? 1971 పార్లమెంటు ఎన్నికల్లో 14కు 11 సీట్లలో ప్రజాసమితి పార్టీని గెలిపిస్తే ఆ పార్టీని మాయం చేసింది ఎవరు.? దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు.? 2004లో మాట ఇచ్చి పదేళ్లు తాత్సారం చేసి వందలాది మంది ఆత్మబలిదానం చేసుకునే దుస్థితికి కారణం ఎవరు, కాంగ్రెస్ కాదా.? రేవంత్‌రెడ్డి స్వయంగా చెప్పినట్లు. వేల మందిని చంపిన బలిదేవత ఎవరు.? అని కేటీఆర్ ప్రశ్నించారు..