- Advertisement -
మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులు…
ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు
Three days of training classes for mid day meal organizers.MEO Rama Venkateshwarluతుగ్గలి:
తుగ్గలి మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సంబంధించి డొక్కా సీతమ్మ పథకం మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మూడు రోజులపాటు శిక్షణా తరగతులను నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాధికారి రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంగళవారం రోజున ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రోజువారి మెనూ పాటించే విధంగా,వంటలో నాణ్యత మరియు శుభ్రత వంటి అంశాలను పరిగణలో తీసుకొని వంట నిర్వాహకులకు మూడు రోజులపాటు శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ రామా వెంకటేశ్వర్లు తెలియజేశారు.ఈ సందర్భంగా మంగళవారం రోజున కస్తూరిబా పాఠశాల యందు ప్రారంభమైన శిక్షణా తరగతులను ఆయన పరిశీలించారు.మంగళవారం రోజు నుండి కస్తూరిబా పాఠశాల యందు 12 పాఠశాలల నిర్వాహకులకు మూడు రోజులపాటు,ఏపీటీడబ్ల్యూఆర్ బాయ్స్ హాస్టల్ నందు 12 పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ రమా వెంకటేశ్వర్లు తెలియజేశారు.
- Advertisement -




