టీడీపీలోకి ఒకేరోజు ముగ్గురు కీలక నేతలు – చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్న వసంత, వేమిరెడ్డి, లావు కృష్ణదేవరాయలు
పల్నాడు జిల్లా..దాచేపల్లి లో ..రా కదిలిరా…సభ లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో…వైసీపీ మాజీ ఎంపీ…లావు కృష్ణ దేవరాయలు.. టీడీపీ లోకి ఎంట్రీ…మారుతున్న పల్నాడు రాజకీయాలు…?
ఈ సభలో….టీడీపీ మాజీ శాసనసభ్యులు యరపతినేని పేరు.. గురజాల నియోజకవర్గ నికి ..చంద్రబాబు ..ఖరారు చేస్తారా…?లేదా..?.. టీడీపీ శ్రేణుల్లో అంతా ఉత్కంఠ..?
ఈ సభలో…వైసీపీ ఎమ్మెల్సీ ..బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు… జంగా కృష్ణ మూర్తి…టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా లేదా…?..టీడీపీ నుండి గురజాల నియోజకవర్గ శాసనసభ టికెట్ విషయం లో ఏ ఐ ఫోన్ కాల్స్ లో జంగా మీద సర్వే..?
ఎవరి నోట ఇదే మాట…వాట్ నెక్స్ట్…..అంతా ఉత్కంఠ…?
వైసీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలు ఒకేరోజు టీడీపీలో చేరుతున్నారు.
చంద్రబాబు సమక్షంలో వసంతకృష్ణప్రసాద్, లావు శ్రీకృష్ణదేవరాయులు, వేమిరెడ్డి ప్రభాకర్ పార్టీలో చేరనున్నారు.
తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా గేరుమార్చింది. రానున్న ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అధికార పీఠం దక్కించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.
ఇప్పటికే వందమంది కూటమి సభ్యులను ప్రకటించి అధికార పార్టీకి సవాల్ విసిరిన చంద్రబాబు శనివారం ఒక్కరోజే వైసీపీకి చెందిన ముగ్గురు కీలక నేతలను పార్టీలో చేర్చుకోనున్నారు.
వీరిలో ఇద్దరు ఎంపీలు కాగా… మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. మరికొందరు కీలక నేతలు సైతం సైకిల్ ఎక్కే అవకాశం ఉంది
ఈ రోజు…గురజాలలో లావు….నెల్లూరులో వేమిరెడ్డి,..కృష్ణ జిల్లా మైలవరంలో..వసంతా..
వైసీపీకి చెందిన ఇద్దరు కీలక ఎంపీలు సైతం శనివారం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
నెల్లూరు జిల్లా కనుపర్తిపాడులో జరిగే మీటింగ్ లో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు చేరుకోనున్న చంద్రబాబుఅక్కడ జరిగే పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు.
అక్కడే వైసీపీ ఎంపీతో పాటు మరికొందరు కీలక నేతలు పార్టీలో చేరనున్నారు.
ఆయనకు తెలుగుదేశం తరఫున నెల్లూరు ఎంపీ టిక్కెట్ ఇవ్వనున్నట్లు తెలిసింది.
అక్కడి నుంచి మధ్యాహ్న పల్నాడు జిల్లా గురజాలలో జరగనున్న రా..కదలిరా బహిరంగలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇదే కార్యక్రమంలో నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు మధ్యాహ్నం గురజాల రా కదలిరా బహిరంగ సభలో తెలుగుదేశం లో చేరనున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవారాయులు పార్టీలో చేరనున్నారు. ఆయనకు సైతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ హామీ ఇచ్చింది. ఆయనతోపాటు వైసీపీకి చెందిన మరో కీలక నేత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సైతం తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.
లావు శ్రీకృష్ణదేవరాయులను గుంటూరు నుంచి పోటీ చేయాల్సిందిగా జగన్ కోరగా… ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను నరసరావుపేట నుంచే బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. అప్పటి నుంచి పార్టీకి ఆయన మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఆయన వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బరిలో దిగనున్నారు.