- Advertisement -
ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు ధర్మకర్తల మండలి సభ్యులు
Three members sworn for the Board of Trusteesతిరుమల, నవంబరు 07
టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా గురువారం ఉదయం ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో భాను ప్రకాష్ రెడ్డి, ముని కోటేశ్వరరావు, సుచిత్ర ఎల్లా ఉన్నారు.
శ్రీవారి ఆలయంలోని స్వామివారి సన్నిధిలో టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఈవో అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -




