ఆలయంలో మూన్నాళ్ళ “సంప్రదాయం”… పంచలకు సెక్యూరిటీ మంగళం…
Three years of tradition in the temple... security auspicious for Panchas...
శ్రీకాళహస్తి నవంబర్ 21
శ్రీ కాళహస్తీశ్వరాలయానికి ఇ. ఓ లు గా వస్తున్న అధికారులు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతులను ప్రవేశపెట్టడం… వారు బదిలీ కావడం లేదా ఉద్యోగ విరమణ చేయడం ఆ విధానాలకు స్వస్తి పలకడం … మరో అధికారి రావడం మరో పద్ధతి ప్రవేశపెట్టడం ఇదే విధంగా కొనసాగుతోంది. 40 రోజుల పాటు ఇన్చార్జి ఇ.ఓగా వ్యవహరించిన చంద్రశేఖర్ ఆజాద్ కొన్ని మార్పులు తీసుకొచ్చారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా జరిగాయి. ఆలయంలో పనిచేసే అందరూ సంప్రదాయ దుస్తులతో ఉండాలనే నిబంధన పెట్టారు. తప్పనిసరిగా అమలు చేయించారు. యూనిఫాం చొక్కా వేసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు ప్యాంట్లకు బదులుగా పంచలు ధరించి విధులకు హాజరయ్యారు. అయితే 20 రోజుల క్రితం బాపిరెడ్డి ఇఓ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరు చెప్పారో ఏం చెప్పారో తెలియదు గానీ సెక్యూరిటీ సిబ్బంది, హోమ్ గార్డులు తిరిగి ప్యాంట్లతో దర్శనమిస్తున్నారు. హడావుడి నిర్ణయాలు తీసుకోవడం… సాధ్యా సాధ్యాలు పరిశీలించక పోవడం.. ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోక పోవడం… తమ ఆలోచనలను తప్పకుండా అమలు చేయాలని బలవంతం చేయడం లాంటి కారణాల వల్ల ఇటువంటి “సంప్రదాయ” పద్ధతులు ముక్కంటి సన్నిధిలో మూడు నాళ్ళ ముచ్చటగా మిగిలిపోతున్నాయి…