ఎస్‌బీఐ ఏటీఎంలో 22 లక్షలు దోచుకెళ్లిన  దుండగులు

- Advertisement -

తిరుపతి: ధనలక్ష్మి నగర్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఎస్‌బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి మొత్తం డబ్బులన్నీ ఎత్తుకెళ్లిపోయారు. ఏటీఎంలో బ్యాంక్ సిబ్బింది 24 లక్షల నగదు నింపారు. నగదు నిండుగా ఉందని దుండగులు భావించినట్లు ఉన్నారు. అర్ధరాత్రి ఏటీఎంలోకి ప్రవేశించి.. గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కట్ చేసి 22 లక్షలు దోచుకెళ్లారు. ఏటీఎంను దుండగులు పూర్తిగా ధ్వంసం చేసేశారు. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని చోరీ ప్రాంతాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

Thugs robbed 22 lakhs from SBI ATM
Thugs robbed 22 lakhs from SBI ATM
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular