Friday, December 12, 2025

కవ్వాల్ ప్రాంతంలో పులి అలజడి

- Advertisement -

కవ్వాల్ ప్రాంతంలో పులి అలజడి

Tiger fear in Qawwal area

అదిలాబాద్, నవంబర్ 8, (వాయిస్ టుడే)
అదిలాబాద్‌ జిల్లా కవ్వాల్ ప్రాంతంలో పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది.  జిల్లాలోని భీంపూర్, తాంసి, తలమడుగు మీదుగా బోథ్ మండలానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అక్కడి నుంచి నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం అడెల్లి తండా నుంచి మహారాష్ట్రలోని అప్పా రావుపేట్ మీదుగా కుంటాల మండలంలోని సూర్యాపూర్, మెదన్పూర్ బుడుబుడు జలప్రాంతంలో సంచరిస్తూ పశువులపై దాడికి పాల్పడిన పెద్దపులి తాజాగా మంగళవారం సరిహద్దుల్లోనే సంచరించడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది.సూర్యాపూర్ అటవీ ప్రాంతంలో పశువులపై దాడి చేయడంతో అధికారులు ట్రాఫ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు పలుమార్లు ఆవు కళేబరాన్ని తినేందుకు వచ్చిన పులి కెమెరాకు చిక్కినట్లు అధికారులు నిర్ధారించారు. గత ఆదివారం సూర్యాపూర్ గ్రామస్తులు మేత కోసం తీసుకెళ్లగా చెరువులో నీళ్లు తాగేందుకు వచ్చిన పెద్దపులి కనిపించడంతో పశువులు బెదిరి నీటిలోకి వెళ్లాయి. పశువుల కాపరులు కుంటి రాములు, దొంతుల చిన్నయ్య చెట్టెక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. మండలం లోని అంబుగామ అటవీ ప్రాంతం పీర్ల గుట్టలో ఆవుపై దాడిచేసి గాయపరిచింది. కాగా మంగళ వారం తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోనే పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి మహారాష్ట్ర సరిహద్దు దాటేవరకు రక్షణ చర్యలు చేపడుతు న్నట్లు డీఎఫ్్వ నాగిని భాను పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అంబుగామ అటవీ ప్రాం తంలో సిబ్బందితో కలిసి పులి రక్షణ చర్యలు పరిశీలించారు. పులి పాద ముద్రలు గుర్తించినట్లు ఆమె వెల్లడించారు.పెద్దపులి సంచారం కొనసాగుతున్న నేపత్యంలో పశువుల కాపారులు, వ్యవసాయ పనులకు వెళ్లే రైతు లు, కూలీలు ఉదయం 9 గంటల వెళ్లి 4 గంటల లోపు పనులు ముగించుకోవాలని సూచించారు. కర్రకు గజ్జెలు కట్టి శబ్దం, అరుపులు చేస్తూ వెళ్లాలని కోరారు. అటవీ ప్రాంతానికి అరకిలోమీటర్ మించి వెళ్లరాదని, పంటల రక్షణకు కంచెలు ఏర్పాటు చేయవద్దని కోరారు. పులి సరిహద్దు దాటే వరకు పశువులను మేత కోసం అడవిలోకి తీసుకెళ్లద్దని సూచించారు.పెద్దపులి దాడిలో మూడు ఆవులపై దాడి చేసిన ఘటన మంచిర్యాల పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ముత్యంపల్లి సెక్షన్ మామిడిగూడలోని గోండుగూడ ప్రాంతంలోని గిరిజన రైతుకి చెందిన ఆవుల మందపై దాడి చేసి మూడు ఆవులపై దాడి చేసినట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. ఇక్కడ సంచరిస్తున్నది ఎస్ 12 మగ పులిగా భావిస్తున్నట్లు తెలి పారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ అడవుల నుంచి కవ్వాల్ టైగర్ జోన్లోని ఖానాపూర్, పెంబి, హాజీపూర్ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పేర్కొన్నారు. సమీప గ్రామాల ప్రజలు, పశువుల కాపర్లు అడవిలోకి వెళ్లవద్దనిఅటవీ అధికారులు సూచించారు.ఇదిలా ఉంటే సారంగాపూర్ డిప్యూటీ రేంజ్ అధికారి నజీర్ ఖాన్ మాట్లాడుతూ పులి సంచార విషయం నిజమే అని ధ్రువీకరించారు. పశువులు మేత కు మైదాన ప్రాంతం లోనే మేత కు తీసుకెళ్లాలని తెలిపారు. కొన్ని రోజుల్లో పులి ప్రాంతం వదిలి వెళ్తుంది అని అన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని జాగ్రత్త వహించాలని కోరారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్