మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు

- Advertisement -

మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్టమైన ఏర్పాట్లు

Tight arrangements for Mahashivratri celebrations

జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ (నెం : 08562 – 246344) ఏర్పాటు :

కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
బద్వేలు

మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల సందర్బంగా జిల్లాలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ  వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని  కడప
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి  ఒక ప్రకటన లో తెలిపారు.

జిల్లాలోని 16 ప్రముఖ శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, తరలివచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు, భద్రతా ఏర్పాట్లను కల్పిస్తూ.. పార్వతీపరమేశ్వరుల కళ్యాణోత్సవాలు, ఊరేగింపు తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం.. దేవాదాయ, రెవెన్యూ, పోలీసు శాఖల ద్వారా అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టిందనన్నారు.

* జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ (నెం : 08562 – 246344) ఏర్పాటు :

శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు  సమాచార, సహాయం నిమిత్తం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని 21 మంది సిబ్బంది తో 3 షిఫ్టుల్లో 24/7 విధులను కేటాయించడం జరిగిందని ఈ నెల 15న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 14-02-2026 తేదీ నుండి 16-02-2026 తేదీ వరకు.. 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular