Saturday, February 14, 2026

 శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు  పటిష్ట భద్రత ఏర్పాట్లు…..

- Advertisement -

 శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు  పటిష్ట భద్రత ఏర్పాట్లు…..

Tight security arrangements for Maha Shivaratri Brahmotsavam in Srisailam…..
శివరాత్రి బందోబస్తుకు వచ్చిన అధికారులతో సమావేశం ఏర్పాటు…

భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా చర్యలు….

మ్యాప్ ఆధారంగా బందోబస్తులో చేయవలసిన విధులపై సవివరంగా  తెలియజేసిన జిల్లా ఎస్పీ….

జిల్లా ఎస్పీ  సునీల్ షొరాణ్ నంద్యాల జిల్లాలోని మహా పుణ్యక్షేత్రం మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం నందు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుచున్న నేపథ్యంలో ప్రజల (భక్తుల)భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని సుమారు 1782 మంది అధికారులు సిబ్బందిచే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి బందోబస్తుకు వచ్చిన అడిషనల్ ఎస్పీ మరియు డిఎస్పీలతో నేడు శ్రీశైలం పోలీస్ స్టేషన్ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ  బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించడం జరిగిందని ప్రతి సెక్టార్ గురించిన వివరాలను మ్యాప్ లో చూపిస్తూ చేయవలసిన విధులపై సవివరంగా తెలియజేయడం జరిగింది.

అధికారులుసిబ్బంది వివరాలు

👉కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల నుండి సుమారు 1614 మంది సివిల్ పోలీస్ అధికారులు సిబ్బంది.
ASPలు — 11,
DSPలు — 24
CIలు ——-78
SIలు ——132
ASI/HCలు-303
PC లు ——-568
WPC లు —- 88
HG లు ——- 386
WHG లు ——-30
Total 1614 మందిని నియమించడం జరిగింది.

👉ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ మరియు ఆర్ముడు రిజర్వు సిబ్బంది (AR) 34 మంది సిబ్బందితోపాటు 3 RSI లు ఉన్నారు.

👉స్పెషల్ పార్టీలు 03 అనగా సిబ్బంది 24 మంది సిబ్బందితో పాటు RSI లు 03 మంది నియమించడం జరిగింది.

👉బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతరం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది.

👉సిబ్బంది మరియు అధికారులు భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి మార్గ నిర్దేశం చేయాలి.

👉లడ్డు కౌంటర్ల వద్ద క్యూలైన్లో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.

👉వాహనాల రద్దీ పెరుగుతూ ఉండడం వలన ట్రాఫిక్ అధికారులు వారి సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా ఉంచకుండా పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే నిలుపుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ  ఆదేశించడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్