అట్లుంటది మనతోని..రూ.100 కోట్ల క్లబ్ లోకి టిల్లు స్క్వేర్..!
గతంలో వచ్చిన డిజె టిల్లు కు స్వీకెల్ గా టిల్లు స్క్వేర్ విడుదల అయింది. అయితే, డిజె టిల్లు పోస్ట్-రిలీజ్ ప్రమోషన్స్ సందర్భంగా సిద్ధు జొన్నలగడ్డ తన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. రాబోయే మూడేళ్లలో 100 కోట్ల హిట్ సాధించాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే, ఎట్టకేలకు అతని కల నెరవేరినట్లు కనిపిస్తోంది. ఇటీవల సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, అనుపుమా హీరోయిన్ గా నటించిన టిల్లు స్క్వేర్ విడుదల అయింది. రిలీజ్ అయినా పదో రోజు 100 కోట్ల మార్కును సాధించింది. తమ కెరీర్‌లో కనీసం పది సినిమాలు చేసిన టైర్ టూ హీరోలు కూడా ఇప్పటి వరకు ఒక్క 100 కోట్ల సినిమా కూడా సాధించలేదు. కానీ టాలెంట్ ఉంటే తనని ఎవరూ ఆపలేరని సిద్ధూ జొన్నలగడ్డ నిరూపించాడు.
గతంలో DJ టిల్లు మూవీ మ్యాజిక్‌ను మళ్లీ అదేవిధంగా వినిపించడం చాలా కష్టమని, టిల్లు స్క్వేర్‌కు అత్యుత్తమ కంటెంట్ అవసరమని చాలా మంది సినిమా ప్రముఖులు పేర్కొన్నారు. మరికొందరు అనుపమ బోల్డ్ రోల్‌ని ప్రేక్షకులు మెచ్చుకోరని అన్నారు. అయితే, ఇది ఇలా ఉండంగా చివరి నిమిషంలో థమన్ చాలా టెన్షన్ క్రియేట్ చేసి సినిమా నుండి తప్పుకున్నాడు.
వీటన్నింటి మధ్య టిల్ స్క్వేర్ థియేటర్లో ఘనంగా విడుదల అయింది. అయితే కొద్దీ రోజుల క్రితం విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విధ్వంసకర ఓపెనింగ్స్ తీసుకోవడంతో టిల్ స్క్వేర్ కలెక్షన్లు భారీగా పెరిగాయి. నిజానికి ఫ్యామిలీ స్టార్ రెండో రోజు కంటే టిల్ స్క్వేర్ తొమ్మిదో రోజు కలెక్షన్లు మెరుగ్గా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఉగాది, రంజాన్, లాంగ్ వీకెండ్‌ల పండుగలు టిల్లూ స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద 150 కోట్ల మార్క్‌ను తాకే అవకాశాలను మరింత పెంచుతాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ టిల్లు స్క్వేర్ సినిమాను నాగ వంశీ, సాయి సౌజన్యతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.