Wednesday, January 15, 2025

కలకలం రేపుతున్న తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం

- Advertisement -

కలకలం రేపుతున్న తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం

Tirumala Laddu Prasadam Controversy

తిరుమల, సెప్టెంబర్  19, (వాయిస్ టుడే)
దేవదేవుడైన శ్రీ వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి లడ్డూ తయారీలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు  వాడారాన్న సంచలన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఊరకనే ఆరోపణలు చేయరు. బలమైన ఆధారాలు ఉండబట్టే చేసి ఉంటారని భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏపీలో ప్రభుత్వం  మారిన వెంటనే టీటీడీ ఈవో సీనియర్ ఐఏఎస్ శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. అప్పటి వరకూ కేంద్ర రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డి ఈవోగా ఉన్నారు. ఆయనకు అర్హతలు లేకపోయినా ఆ పోస్టు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. శ్యామలరావు ఈవోగా  బాధ్యతలు చేపట్టిన వెంటనే  లడ్డూ ప్రసాదంపై వస్తున్న ఆరోపణలపై దృష్టి పెట్టారు. వెంటనే.. లడ్డూ ప్రసాదానికి  వాడుతున్న పదార్థాలను తనిఖీ చేయించారు. నెయ్యిని నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ లో టెస్టు చేయించారు. ఫలితాలు ఏమిటో  బయట పెట్టలేదు కానీ.. వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టేశారు. బహుశా.. ఆ నివేదికలో జంతువుల కొవ్వు ఉందన్న రిపోర్టు వెలుగులోకి వచ్చి ఉంటుందని.. దాన్ని సీఎంకు తెలియచేసి ఉంటారని భావిస్తున్నారు.తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత క్వాలిటీతో ఉన్న పదార్థాలతోనే సరఫరా చేస్తారు. గత ఇరవై ఏళ్లకుగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కు చెందిన నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే వాడుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నందిని బ్రాండ్ కు చెల్లిస్తున్న  ధర కంటే తక్కువ ధరను నిర్ణయిస్తూ టెండర్లు పిలిచారు. ఆ ధర ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని నష్టాలు వస్తాయని నందిని టెండర్లలో పాల్గొనలేదు. ఈ కాంట్రాక్టులను.. యూపీకి చెందిన రెండు సంస్థలు దక్కించుకున్నాయి. ఆ సంస్థలు నెయ్యి ఎలా తయారు చేస్తాయన్నది పట్టించుకోలేదు. ప్రీమియర్ అగ్రి ప్రొడక్ట్స్, క్వాలిటి లిమిటెడ్ వంటి కంపెనీలకు ఇచ్చారు. నిజానికి ఇలాంటి  నెయ్యి పేరు మోసిన డెయిరీలే సిద్దం చేయగలవు. వీరు ఇచ్చే నెయ్యి క్వాలిటీని స్వతంత్ర సంస్థలతో కాకుండా తామే పరీక్షిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు. నిజానికి శ్రీవారి లడ్డూలు తయారు చేయడానికి అవసరమైన అత్యంత నాణ్యమైన నెయ్యి..  ఆ యూపీ కంపెనీలు సరఫరా చేసినంత తక్కువ ధరకు రావు. కేవలం నందిని బ్రాండ్ నెయ్యి టెండర్లలో పాల్గొనకుండా చేయడానికే ఆ ధరను నిర్ణయించి ఉద్దేశపూర్వకంగా ఆ కంపెనీని తప్పించారని.. తమకు ఇష్టమైన కంపెనీలకు నెయ్యి సరఫరా టెండర్లు దక్కేలా చేశారని అప్పట్లోనే టీడీపీ ఆరోపణలు గుప్పించింది. కానీ టీటీడీలో ప్రతిదీ తాము టెండర్ల ద్వారానే కొనుగోలు చేస్తామని చెప్పి టీటీడీ ఆ నెయ్యినే కొనుగోలు చేసింది.వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు రక్షణ శాఖ ఉద్యోగిగా ఉన్న ధర్మారెడ్డినే కీలకంగా వ్యవహరించారు. జేఈవోగా ఉన్నా.. ఈవోగా ఉన్నా ఆయనదే పెత్తనం. నిజానికి ఐఏఎస్ అధికారులకే ఆ బాధ్యతలు ఇవ్వాలి. కానీ జగన్  మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ధర్మారెడ్డినే  టీటీడీలో కీలకంగా వ్యవహరించారు. టీటీడీ చైర్మన్ గా జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి , ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లగా వ్యవహరించారు. జంతువుల కొవ్వును వాడారాని.. ఆ నెయ్యి విషయంలో వచ్చిన  ల్యాబ్ రిపోర్టు బయటకు వస్తే..  హిందువుల మనోభావాలు దెబ్బతీసినట్లుగా వైసీపీ తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
సుప్రీం కోర్టుకు వెళతామన్న వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును వైసీపీ హయాంలో వాడారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో పార్టీ అధినేత జగన్ తో వైవీ సుబ్బారెడ్డి సమావేశం అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నీచమైన ఆరోపణలు చేశారని.. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. చంద్రబాబు తాను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలు ఉంటే బ యట పెట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే..న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. తిరుమలలో వైసీపీ హయాంలో తాము తిరుమల ఆలయ పవిత్రత  పెంచామన్నారు. తాము ఏ తప్పూ చేయలేదని శ్రీవారి పాదాల వద్ద కుటుంబంతో సహా ప్రమాణం చేస్తానని..చంద్రబాబు కూడా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆధారాలు బయట పెట్టకపోయినా.. ప్రమాణానికి రాకపోయినా  పరువు నష్టం కేసులు దాఖలు చేస్తామని హెచ్చరించారు. వైసీపీని బద్నాం చేయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని .. కేంద్రంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని సవాల్ చేశారు.  స్వామివారి సమర్పించే నైవేద్యంలో ఆర్గానిక్‌ సామాగ్రి వాడామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.  స్వామివారి నైవేద్యంలో  స్వచ్ఛమైన నెయ్యిని వాడాం..2019 నుంచి 2024 వరకు మధ్య క్వాలిటీ చెక్‌ చేసి నాణ్యత లేదని పదిసార్లు నెయ్యి ట్యాంకర్లు వెనక్కి పంపించామని.. నాణ్యత విషయంలో రాజీ పడలేదని సుబ్బారెడ్డి చెప్పారు. బహిరంగ మార్కెట్లో కొనే వస్తువుల్లో రసాయనాలు ఉంటాయని వాటిని కొనుగోలు చేయలేదన్నారు.  స్వామి వారి నైవైద్యానికి అవసరమయ్యే నెయ్యిని రాజస్థాన్ నుండి తెప్పిస్తామని అందుకు అయ్యే రవాణా ఖర్చు రూ. లక్షను ఓ దాత భరిస్తారన్నారు. తిరుమలలోనే నెయ్యి నాణ్యతను పరిశీలించడానికి ల్యాబ్ ఉందన్నారు. తాను టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ల్యాబ్ ను  అత్యాధునికంగా మార్చామని .. పకడ్బందీగా నెయ్యిని ప్రొక్యూర్ మెంట్ చేసుకున్నా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మా హయంలో ప్రతి నిర్ణయం బోర్డులోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ తప్పు జరిగినా ఊరుకనేది లేదన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి జంతువుల కొవ్వు వాడారని చంద్రబాబు ఆరోపణలు సంచలనం సృష్టింటాయి. దీనిపైనే వైవీ సుబ్బారెడ్డి చాలెంజ్ చేశారు. మరో వైపు టీటీడీలో జరిగిన విజిలెన్స్ దర్యాప్తు సందర్భంగా తనకు వచ్చిన నోటీసుల్ని వైవీ సుబ్బారెడ్డి కోర్టులో చాలెంజ్ చేశారు.
హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటలా
తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారంరేపుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు నుంచి తీసిన నూనె వినియోగించారని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. దీనిపై తన కుటుంబంతో సహా ప్రమాణం చేయడానికి సిద్ధమేనని.. చంద్రబాబు కూడా ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ విసిరారు. మొత్తానికి ఈ వివాదం శ్రీవారి భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హిందూ వ్యతిరేకులు మాట్లాడాల్సిన మాటలు చంద్రబాబు మాట్లాడారన్నారంటూ మండిపడ్డారు. శ్రీవారి భక్తులు అత్యంత పవిత్రమైనదిగా భావించే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికావన్నారు. హిందువుల మనోభావాలను చంద్రబాబు కించపరిచారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే హిందూయేతరుడైన కరీముల్లా షరీఫ్‌ను విజిలెన్స్‌ అధికారిగా నియమించారని ఆరోపించారు. కరీముల్లాతో చంద్రబాబు ఆయనకు కావాల్సిన రిపోర్ట్ రాయించుకున్నారని ఆరోపించారు. జంతువుల కొవ్వుతో లడ్డూ తయారు చేసినవారంతా సర్వం నాశనం అవుతారన్నారు. లేదంటే ఆరోపణలు చేసిన వ్యక్తే సర్వనాశనం అవుతారన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్