వైకుంఠ ఏకాదశి – భద్రతా ఏర్పాట్లు
– వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలించిన తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు,
– చంద్రగిరి మెట్టు, అప్పలాయగుంట, అలిపిరి పాదాలు ప్రాంతాల్లో బందోబస్తు సమీక్ష
– భక్తుల రద్దీ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు.
– భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ
– అన్ని కీలక ప్రాంతాలు కామన్ కమాండ్ కంట్రోల్
– సీసీ కెమెరాల అనుసంధానం.
టీటీడీ–పోలీస్ సమన్వయంతో భద్రతా చర్యలు.
Tirupati District SP L. Subbaraidu,
తిరుపతి,
తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పర్వదినాలను పురస్కరించుకుని, తిరుపతిలొ భక్తుల రాకపోకలు అధికంగా ఉండనున్న నేపథ్యంలో, తిరుపతి జిల్లా ఎస్పి ఎల్. సుబ్బరాయుడు, ఈరోజు ఉదయం వివిధ ప్రాంతాల్లో అమలు చేస్తున్న భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చంద్రగిరి శ్రీవారి మెట్టు, అప్పలాయగుంట, అలిపిరి పాదాలు తదితర కీలక ప్రాంతాలను సందర్శించి, భక్తుల సౌకర్యాలు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు విధులు, రద్దీ నిర్వహణ చర్యలను సమీక్షించారు.
భక్తులు అధిక సంఖ్యలో వచ్చిన సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ మరియు సంబంధిత సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులకు అసౌకర్యం లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అన్ని కీలక ప్రాంతాలను కమాండ్ & కంట్రోల్ రూమ్‌కు సీసీ కెమెరాల ద్వారా అనుసంధానం చేయడం జరిగిందని, ఈ సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, ఏ చిన్న సమాచారం ఉన్నా వెంటనే కమాండ్ కంట్రోల్‌కు తెలియజేస్తూ విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.
అలాగే, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలొ పని చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ అన్ని విభాగాల సమన్వయంతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టి, భక్తుల భద్రత, సౌకర్యాలు, శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
రులు ఉన్నారు.


