డివిజన్ పరిధిలో 5వ రోజు పాదయాత్ర
కంటోన్మెంట్, అక్టోబర్ 31 (వాయిస్ టుడే ప్రతినిధి): రాష్ట్ర సంక్షేమ పథకాలే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. మంగళవారం నాడు ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ పరిధిలోని, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ను భారీ మెజారిటీతో గెలిపించాలని, 5వ రోజు ఇంటింటా పాదయాత్ర చేస్తూ, కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ముద్ధం నరసింహ యాదవ్ మాట్లాడుతూ…. అభివృద్ధిని చూసి బిజెపి నాయకులు బిఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. ఏనుగుల తిరుపతి మాట్లాడుతూ… నేను కూడా తెలంగాణ ఉద్యమకారుల్ని అని, తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేశారని తెలిపారు. మాధవరం కృష్ణారావుని భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్, మాక్కల నర్సింగ్ రావు, కర్రె లావణ్య, గడ్డం నర్సింగ్ రావు, ఇర్ఫాన్, హరినాథ్, లలిత, బుర్రి యాదగిరి, మట్టి శ్రీనివాస్, జాంగిర్, గణేష్ యాదవ్, చందు యాదవ్, జె. రాజు గౌడ్, భాస్కర్, కృష్ణారెడ్డి, పోచయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.



