తిరుపతి వేంకటేశ్వరస్వామితో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదు
తిరుమల వెంకన్న కొండపై జగన్ పాపాలే ఆయన మెడకు చుట్టుకున్నాయి
నాలుగు గోడల మధ్య బైబిల్ చదివే జగన్ తిరుమలను ఎలా గౌరవిస్తారు
సీఎం చంద్రబాబు చొరవతోనే టీటీడీలో జగన్ అక్రమాలు బయటపడ్డాయి
తన సొంతూరు పాత ముచ్చుమర్రిలో అంగన్వాడీ నూతన భవనంను ప్రారంభిస్తున్న నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Tirupati Venkateswara Swamy’s relationship with no one got better
నంద్యాల
ప్రపంచంలోని హిందువుల ఆరాధ్య దైవం తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి తో పట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదని, గత ఇదేళ్ళ వైసీపీ అధినేత జగన్ పాలనలో టీటీడీలో చేసిన ఘోర పాపాలే ఆయన మెడకు చుట్టుకున్నాయని, హిందువులే కాదు ముస్లింలు, ఇతర మతాల వారు కూడా తిరుపతి లడ్డును పవిత్రంగా భావించి తింటారని, నాలుగు గోడల మధ్య బైబిల్ చదివే జగన్ తిరుమలను ఎలా గౌరవిస్తారని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రశ్నించారు.
శనివారం నందికొట్కూరు నియోజకవర్గం పాత ముచ్చుమర్రి గ్రామంలో నూతన అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను జగన్ పాలనలో చిన్నాభిన్నం అయ్యాయని, ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసి హిందువుల మనోభావాలను గాయపరిచారని, ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిని జగన్ పాలనలో వ్యాపార కేంద్రంగా చేసి నిధులు, ఆభరణాలు దోపిడీ చేయబడ్డాయని, ఆలయ పవిత్రతను నాశనం చేసేందుకు పవిత్రమైన తిరుమల లడ్డులో కూడా కల్తీ చేసి పెద్ద తప్పు చేశారని బైరెడ్డి శబరి ఆరోపించారు.
జగన్ పాలనలో అన్యమతస్థులు, నాస్తికులను టీటీడీ చైర్మన్లుగా చేసి ఆలయ ప్రతిష్ట మసకబారేలా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం భూమన కరుణాకర్ రెడ్డి కూతురు వివాహం చేసి మళ్ళీ ఇటీవల తిరుమలలో ఎలా ప్రమాణం చేస్తారని ఆమె ప్రశ్నించారు.
హిందువులతో పాటు అన్ని మతాలవారు, ముస్లింలు కూడా తిరుమల లడ్డును పవిత్రంగా భావించి తింటారని, హిందువుల దైవంగా భావించే గోమాత కొవ్వూ, ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించే పంది కొవ్వు టీటీడీ లడ్డులో కల్తీ చేయడం మహా పాపం అన్నారు.
హిందువులుగా ఇతర మతాల ప్రార్ధన స్థలాలకు వెళ్ళితే వారి అనుమతి, ఆచార వ్యవహారాల ప్రకారం దర్శనం చేసుకుంటామని, టీటీడీ ఆచార వ్యవహారాలు గౌరవించకుండా జగన్ తిరుమల వెళ్తామంటే హిందువుల మనోభావాలు దెబ్బ తీయడం కాదా అని ఎంపీ బైరెడ్డి శబరి నిలదీశారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడగానే గత జగన్ ఇదేళ్ళ పాలనలో టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించగా ఏకంగా పవిత్రమైన టీటీడీ లడ్డులోనే పంది, చేప, గోవుల కొవ్వులను నెయ్యి స్థానంలో కల్తీ చేశారని కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ల్యాబ్ లలో బయటపడడం ఆందోళన కలిగించిందన్నారు. టీటీడీలో జగన్ గ్యాంగ్ ఆరాచకాలు సీఎం చంద్రబాబు సాక్ష్యంతో బయటపెడితే సమాధానం చెప్పకుండా మళ్ళీ నిందలు వేయడం, ఇతర కులాలను జగన్ రెచ్చగొట్టడం సరికాదన్నారు.
నేరం చేసిన వారు శిక్షించబడాలని, టీటీడీతో పాటు రాష్ట్రంలోని హిందూ ఆలయాలను పరిరక్షించి, ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, ఆలయాల పవిత్రతను కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విజ్ఞప్తి చేశారు.