కార్పొరేషన్ చైర్మ న్ పదవి కావాలంటే పదేళ్ల్లు కాంగ్రెస్ పార్టీలో పని చేసి ఉండాలి
* పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్‌లోనే చెప్పాలి
* గాంధీభవన్ బయట మాట్లాడొద్దు
* అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్ అల్టిమేటం
హైదరాబాద్ మార్చి 5
To get the post of corporation chairman, one should have worked in Congress party for 10 years: Meenakshi Natarajan
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ స్థితిగతులు, ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ సమీక్షించారు. పార్టీ పరిస్థితిపై క్షేత్రస్థాయిలో ఆరా తీశారు. కార్పొరేషన్ చైర్మ న్ పదవి కావాలంటే పదేళ్ల్లు కాంగ్రెస్ పార్టీలో పని చేసి ఉండాలని, కార్యకర్తలను ఎలా వాడుకోవా లో తెలుసని, పార్టీ విజయం కోసం కష్టపడిన అం దరికీ న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన కొత్త వారిని కలుపుకు పోతామన్నారు. పార్టీ అంతర్గత విషయాలు మీటింగ్‌లోనే చెప్పాలని గాంధీభవన్ బయట మాట్లాడొద్దని ఆమె సూచించారు. అలాగే మంత్రులు తప్పొప్పులు కూడా మీటింగ్‌లోనే చె ప్పాలని అంతేకానీ ప్రత్యేక సమావేశాలు పెట్టడం సోషల్ మీడియాలో పెట్టడం వంటివి చేసి పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయొద్దన్నారు.పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఇకపై ఎవరైనా గొడవ పడినా, పార్టీపై బహిరంగంగా కామెంట్స్ చేసినా ఊరుకునే ప్రసక్తే లేదని నేతలకు ఆమె వార్నింగ్ ఇచ్చారు. ఇన్ చార్జీల వల్లే సమస్యలు వస్తే పదవి నుంచి తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. నియోజక వర్గ ఇన్‌చార్జీలు బాధ్యతాయుతంగా వ్యవహారించి అందరినీ కలుపుకుపోవాలన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే లు ఎల్లవేళలా ప్రజలకు అందు బాటులో ఉండాలని ఆమె సూచించారు. పటాన్‌చెరులో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తమను ఇబ్బంది పెడుతున్నారని కాట శ్రీనివాస్ గౌడ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. సమస్య పరిష్కారం కోసం కమిటీ వేసినా ఇప్పటివరకు రిపోర్టు ఇవ్వలేదంటూ ఆయన మీనాక్షి నటరాజన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలంటూ మీనాక్షి నటరాజన్‌కు కాట శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
బిఆర్‌ఎస్ నేతలే అధికారం చెలాయిస్తున్నారు: మీనాక్షి ఎదుట నాయకుల ఆవేదన
అధికారులు తమ మాట వినడం లేదని మరికొందరు నేతలు ఎమ్మెల్యే మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. ఇంకా బిఆర్‌ఎస్ నేతలే అధికారం చెలాయిస్తున్నారని నాయకులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇందిరమ్మ ఇళ్లు అయినా తాము చెప్పిన వారికి ఇస్తే గౌరవం ఉంటుందని మీనాక్షి నటరాజన్‌కు పలువురు నేతలు విజ్ఞప్తి చేశారు.ఈ సమీక్షలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల ప్రజాపాలనలో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మీనాక్షి నటరాజన్ చర్చించారు. చారిత్రాత్మక నిర్ణయాలైన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపైనా ఆమె అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందని ఆమె ఆరా తీశారు. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం, కమిటీల ఏర్పాటుపైనా కీలకంగా ఆమె చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మీనాక్షి దిశానిర్దేశం చేశారు. పార్టీలో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం లోపించకుండా ఐక్యంగా ముందుగు సాగాలని ఆమె హితవు పలికారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. ఈ సమీక్షలో ఏఐసిసి ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిసిసి అధ్యక్షులు, పోటీ చేసిన అభ్యర్థులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.