- Advertisement -
అందం కోసం మహిళ చేసిన ప్రయత్నం ఫెయిల్

హైదరాబాద్: తనని మోడల్ గా చూడాలనుకున్న భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఓ మహిళాకు తీరని నష్టం వాటిల్లింది. ఆమె ప్రయత్నం బెడిసి కొట్టింది. బాధితురాలి పొడుగ్గా ఉన్న హెయిర్ ని బ్యూటీషియన్ కట్ చేసి హెయిర్ ఆయిల్ పెట్టింది. బ్యూటీషియన్ పెట్టిన హెయిర్ ఆయిల్ తో మొత్తం జుట్టంతా ఊడిపోయింది. వున్నహెయిర్ రాలిపోవడంతో కంగుతిని మహిళ ఇంటికి పరుగులు తీసింది. భార్య హెయిర్ పోవడం చూసి భర్త షాక్ కు గురైయాడు. అందంగా కనిపించాలనుకున్న భార్యకు ఉన్న వెంట్రుకలు కూడా పోవడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది. ఊడిపోతున్న వెంట్రుకలని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధిత మహిళ అక్కడ బ్యూటీ పార్లర్ నిర్వాహకులపై పిర్యాదు చేసింది. అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



