- Advertisement -
నేడు జిల్లెలగూడకు ఈటెల రాజేందర్
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ గెలుపు కోరుతూ మహేశ్వరం నియోజకవర్గం జిల్లెలగూడ వివేకానంద చౌరస్తాలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంటుందని బీజేపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బహిరంగ సభకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరవుతారని వివరించారు. ఈ బహిరంగ సభకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.
- Advertisement -



