- Advertisement -
నేడే ప్రజాపాలన విజయోత్సవాలు:: కలెక్టర్ బి సత్య ప్రసాద్
Today is the triumph of democracy :: Collector B Satya Prasad
జగిత్యాల,
రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.సత్య ప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.జగిత్యాల పట్టణంలోని ఎస్విఎల్ఆర్ గార్డెన్ లో ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం 6.00 గంటలకు సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ అలేఖ్య పుంజల కళా బృందంచే జయ జయహే ప్రజాపాలన పేరుతో
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, జిల్లాలోని ప్రజాప్రతినిధులను ఆహ్వానించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను వివిధ కళారూపాల్లో ప్రదర్శిస్తారని వివరించారు. అధిక సంఖ్యలో నగరప్రజలు, ఉద్యోగులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఇచ్చిన ప్రకటనలో కోరారు.
- Advertisement -


