Friday, November 22, 2024

ఇవాళ కేసీఆర్  డిశ్చార్జి

- Advertisement -

ఇవాళ కేసీఆర్  డిశ్చార్జి

హైదరాబాద్, డిసెంబర్ 14

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్రమంగా కోలుకుంటున్నారు. ఇంట్లో జారిపడిన ఘటనలో తుంటి ఎముక విరిగిపోవడంతో శస్త్రచికిత్స చికిత్స చేశారు హైదరాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు. ఆ తర్వాత నుంచి కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఇంటికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించారు. శుక్రవారం ఆయన్ను డిశ్చార్జ్ చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్ ఆసుపత్రి నుంచి ఆయన నేరుగా నందినగర్ లోని తన నివాసానికి వెళ్లనున్నారు. మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు తెలిపారు.తన ఫామ్ హౌస్ లోని బాత్రూమ్‌లో ప్రమాదవశాత్తు కాలు జారి పడటంతో కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకను రిప్లేస్‌ చేశారు. ఆసుపత్రిలో కేసీఆర్ ను రేవంత్ రెడ్డి, చంద్రబాబు, చిరంజీవి, చిన్న జీయర్ స్వామి, ప్రకాశ్ రాజ్ తదితర ప్రముఖులు పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గత 6 రోజులుగా కేసీఆర్‌ను పరామర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య కేసీఆర్ తాజాగా ఓ వీడియోను కూడా విడుదల చేశారు. తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తనను పరామర్శించేందుకు ఎవరూ రావద్దని కోరారు.కేసీఆర్‌ అభ్యర్థన మేరకు కొద్ది రోజులుగా ఆస్పత్రి పరిసరాల్లో తగ్గిన అభిమానుల తాకిడి ఇప్పుడు నందీనగర్‌లోని ఆయన నివాస వద్ద పెరిగే అవకాశం ఉంది. తమ అభిమాన నాయకుడు ఎప్పుడెప్పుడు కోలుకొని తమ మధ్యకు వస్తారా అని కార్యకర్తలు, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్   వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో నడుస్తున్నారు.   హాస్పిటల్‌లోని తన రూమ్‌లో వాకర్‌‌తో కేసీఆర్ నడుస్తున్నారు.  వేగంగా రికవర్ అవుతున్నారని తెలిపారు. బ్రీతింగ్ ఎక్సర్‌‌సైజ్‌లు చేయిస్తామని, ఆయన మెడికల్‌గా స్టేబుల్‌గా ఉన్నారని, నార్మల్ఫుడ్ తింటున్నారని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, శరీరం ఇట్లాగే సహకరిస్తే వేగంగా ఆయన సొంతంగా నడిచే అవకాశం ఉంది.  పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూండటంతో ఇక ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్లు  భావిస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పరామర్శించేందుకు ప్రముఖులు వస్తున్నారు. వారితో యశోదాలో రోగులకు ఇబ్బంది ఎదురవుతోంది. రావొద్దని కూడా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌కు ఆపరేషన్‌ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.   సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని ప్రకటించారు.  వారం కిందట ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ జారిపడటంతో ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తరలించారు.  సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు.. తుంటి ఎముక విరిగినట్టుగా గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత్రి హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు.                                      కేంద్రమంత్రిగా ఉన్న సమయమంలోనూ కేసీఆర్ ఓ సారి ఢిల్లీలో బాత్ రూంలో జారి పడ్డారు. దాంతో అప్పుడు కూడా ఆయనకు తుంటి ఆపరేషన్ జరిగింది. ఈ సారి రెండో వైపు ఆపరేషన్ జరిగింది.  అయినా కేసీఆర్ మానసికంగా ధృడంగా ఉన్నారని.. ఆస్పత్రిలో పుస్తకాలు చదువుతున్నారని ఎంపీ సంతోష్ రావు తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్