నేడు మక్తల్ లో ఈటల భారీ బహిరంగ సభను
.
విజయవంతం చేయాలని పిలుపు…
బిజెపి అభ్యర్థి జలంధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కొండయ్య ,కర్ణాటక కోలార్ ఎంపీ మునిస్వామి
మక్తల్,నవంబర్ 21 వాయిస్ టుడే ప్రతినిధి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలే ఊపిరిగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం 40 ఏళ్లుగా పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఎన్నో పార్టీలకు అవకాశం ఇచ్చారని …ఈ ఎన్నికల్లో బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థి జలంధర్ రెడ్డి, మక్తల్ మాజీ ఎంపీపీ భాజపా రాష్ట్ర నాయకులు కొండయ్య, కర్ణాటక రాష్ట్రం కోలార్ లోక్సభ సభ్యులు మునిస్వామి విజ్ఞప్తి చేశారు .60 సంవత్సరాల పాలించిన కాంగ్రెస్, 10 సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. ఆ రెండు పార్టీలను వజ్రాయుధం లాంటి ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు .ఈనెల 22న ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఎన్నికల కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఈటెల రాజేందర్ మక్తల్ రానున్నట్లు తెలిపారు. సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్ ,నియోజకవర్గ కన్వీనర్ కర్ని స్వామి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేవరింటి నరసింహారెడ్డి , ఎంపీటీసీ బలరాం రెడ్డి,పట్టణ బిజెపి అధ్యక్షుడు బి. రాజశేఖర్ రెడ్డి, నాయకులు బాల్చేడ్ మల్లికార్జున్,కే .సోమశేఖర్ గౌడ్, చిట్యాల లక్ష్మణ్, ప్రతాపరెడ్డి,నెంబర్ రాములు, సత్య శ్రీను ,రాజా గౌడ్ ,రాములు ,రాజశేఖర్, కుర్వ లింగం తదితరులు పాల్గొన్నారు.