పవన్ కు మద్దతుగా టాలీవుడ్…
హైదరాబాద్, మే 8,
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 సంవత్సరాల నుంచి తనదైన సేవలను అందిస్తూ సినిమా ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ కూడా సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సినిమాలు చేస్తూ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన 2014 లోనే జనసేన పార్టీని పెట్టాడు. ఇక ఇప్పుడు టిడిపి, బిజెపి లతో కలిసి ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొంటున్నాడు.ఇక ఈ నెల 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో భాగంగా ఆయన కాంపెనింగ్ నిర్వహిస్తూ చాలా చురుగ్గా తన పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయనకు ఇప్పుడిప్పుడే చాలా మద్దతు అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా యంగ్ హీరోలైతే పవన్ కళ్యాణ్ కి అండగా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా చిరంజీవి తన తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించమని ఒక వీడియో బైట్ ను కూడా రిలీజ్ చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే నాని కూడా పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు.ఇక వీళ్ళతోపాటుగా సాయి ధరమ్ తేజ్ కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ఎలాగైనా పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని పవన్ కళ్యాణ్ గురించి కొన్ని మాటలు అయితే చెప్పాడు. ఇక రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ కి మద్దతు గా మాట్లాడాడు. ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న తేజ సజ్జ కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా “తొందరలో జరగబోయే ఒక బిగ్ డే కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు ఎలాగైనా మమ్మల్ని తలెత్తుకునేలా చేయండి సార్” అంటూ పవన్ కళ్యాణ్ కి మద్దతు గా తను పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.ఇక ఈ లెక్కన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తే అధికార పార్టీ నుంచి వాళ్ల సినీ కెరియర్ కి ఏదైనా ఇబ్బంది రావచ్చని వాళ్ళు ఏ రకంగానూ స్పందించడం లేదు. కానీ యంగ్ హీరోల నుంచి పవన్ కళ్యాణ్ కి మంచి మద్దతు అయితే లభిస్తుందనే చెప్పాలి…ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు కూడా ఎవరికి భయపడకుండా ధైర్యం చేసి మరి పవన్ కళ్యాణ్ కి మద్దతు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి ఎవరైనా మద్దతుగా మాట్లాడితే చాలు అధికారంలో ఉన్న గవర్నమెంట్ వాళ్లని ఏదో ఒక రకంగా హింసించడం మనం చాలా సార్లు చూశాం…అయిన కూడా వీళ్లు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…