Thursday, April 24, 2025

 పాపం…గోరంట్ల మీడియా ముందు ముసుగేసి

- Advertisement -

 పాపం…గోరంట్ల
మీడియా ముందు ముసుగేసి
అనంతపురం, ఏప్రిల్ 12, ( వాయిస్ టుడే )

Too bad...Gorantla is hiding in front of the media

పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడుతూ, పోలీసులపై జులుం ప్రదర్శించి వారి విధులకు ఆటంకం కలిగించిన గోరంట్ల.మాధవ్ తో పాటు ఆయన ఐదుగురు అనుచరులను అరెస్ట్ చేశామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ప్రకటించారు.  వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్  భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అనే నిందితుడిని అరెస్టు చేసి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్ వాహనాన్ని అనుసరించారు గోరంట్ల మాధవ్. కారు ఆపి మరీ పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై గోరంట్ల మాధవ్ దాడికి పాల్పడ్డారని ఎస్పీ తెలిపారు. మంగళగిరి రూరల్ పోలీసులు గోరంట్ల  మాధవ్,  అతని అనుచరుల బారి నుండి నిందితుడిని రక్షించి గుంటూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి తీసుకొస్తుండగా మరలా గోరంట్ల మాధ వ్అతని అనుచరులు  పోలీస్ వాహనాన్నితమ వాహనాలతో వెంబడిస్తూ నిందితుడిని , పోలీసులను  భయబ్రాంతులకు గురి చేశారని ఎస్పీ తెలిపారు. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడిపై దాడికి పాల్పడటం, పోలీస్ విధులకు ఆటంకం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించి భవిష్యత్తులో ఎవరూ కూడా ఇటువంటి నేరపూరిత చర్యలకు పాల్పడకుండా ఉండాలని గోరంట్ల.మాధవ్ మరియు అతని అనుచరులపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా చట్ట వ్యతిరేక బృందాన్ని పోగుచేయడం. ఆంధ్రప్రదేశ్ ఐటీ,  విద్యా శాఖ మంత్రి  గురించి అసభ్యకరంగా  , వ్యక్తిగత దూషణలకు పాల్పడటం వంటి పలు ఘటనలకు సంబంధించి గోరంట్ల మాధవ్ పై కేసులు నమోదై ఉన్నాయన్నారు.  అలాగే ఒక పోక్సో కేసుతో పాటు 04 ఇతర కేసులు కూడా నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు. గోరంట్ల మాధవ్ మాజీ సీఐ . ఎంతో మంది నిందితుల్ని, నేరస్తుల్ని అలా మీడియా ముందు నిలబెట్టి ఉంటారు..ఇప్పుడు ఆయనే అలా నిలబడాల్సి వచ్చింది. మీడియా ముందు ఆయనను ప్రవేశ పెట్టేందుకు తీసుకు వచ్చే సమయంలో.. ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము మాజీ పోలీసు అధికారినని..మాజీ ఎంపీనని.. మీడియా ముందు ఎలా నిలబెడతారని ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనకు ముసుగేసి మీడియా ముందు ప్రవేశ పెట్టి.. ఆ తర్వాత కోర్టుకు తరలించారు.   మాజీ ఎంపీగా ఉన్న ఆయన దుందుడుకుగా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూంటారు. మామూలుగా అయితే  ఆయన అరెస్టు అయ్యే వారు కాదు. అరెస్టు చేస్తారని తెలిసి కూడా ఆయన పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడ్ని పోలీసులపై దౌర్జన్యం చేసి మరీ దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయనను అడ్డుకోవడానికి ఓ పోలీసు అధికారి చెంప చెళ్లుమనిపించారని చెబుతున్నారు. ఇప్పుడు గోరంట్ల మాధవ్ .. జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్