కాంగ్రెస్ వైపే..కేసీఆర్…?
హైదరాబాద్, మార్చి 26, (వాయిస్ టుడే)
Towards Congress..KCR...?
సీఆర్ ఎప్పుడూ లేనిది ఇటీవల చంద్రబాబు గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన ఎన్డీఏ కూటమిగా తెలంగాణలో అడుగుపెడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. తాను ఒంటరిగానే పోటీ చేస్తానని.. అధికారంలోకి వస్తానని చెబుతున్నారు. అసలు చంద్రబాబు పొత్తులతో పోల్చుకోవాల్సిన అవసరం కేసీఆర్ కు లేదు. కానీ రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరు అన్నట్లుగా ఆలోచిస్తే.. కేసీఆర్ మాటల్లో లోతైన అర్థం ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెన్నైలో నిర్వహించిన సమావేశం తెలంగాణ రాజకీయాల్లో మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇండియా కూటమిలో కీలకమైన పార్టీ డీఎంకే. ఆ పార్టీ ఓ విధానం తీసుకుని సమావేశం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ కూటమిలోని పార్టీ కాబట్టి కాంగ్రెస్ సీఎం హాజరయ్యారు. కేటీఆర్ కూడా డీఎంకే నేతలు వచ్చి పిలిచినప్పుడే వస్తానని చెప్పారు. ఆ ప్రకారం హాజరయ్యారు. ఈ సమావేశం ఎజెండా బీజేపీని టార్గెట్ చేయడం . అదే జరిగింది బీజేపీ దక్షిణాదికి అన్యాయంచేస్తోందని అందరూ వాదించారు. ఈ వాయిస్ వినిపించిన వారిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా ఉన్నాయిచెన్నై సమావేశం తర్వాత తెలంగాణ సమీకరణాలు మారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారిలో రేవంత్, కేటీఆర్ ఉంటారు. అదే ఫార్ములా తెలంగాణకు అన్వయించేందుకు ఓ అవకాశం ఏర్పడినట్లే . ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్ రాజకీయాలకు ఇదో పునాది అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసం గతంలో బీఆర్ఎస్ ప్రయత్నించిందని స్వయంగా మోదీ చెప్పారు. తాను అవసరం లేదని చెప్పానన్నారు. భవిష్యత్ లోనూ బీఆర్ఎస్ తో పొత్తులు ఉండబోవని చెప్పారు. ఏపీ తరహాలో తెలంగాణలో కూడా ఎన్డీఏ ఉంటుందన్న ప్రచారం ఇటీవలి కాలంలో ఊపందుకుంది. టీడీపీ, బీజేపీ తెలంగాణలో కలుస్తాయని అంటున్నారు. దక్షిణ తెలంగాణలో పట్టు సాధించాలంటే.. టీడీపీ, జనసేనతో కలవడం మంచిదని బీజేపీ హైకమాండ్ అనుకుంటోందని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే అటు ఉత్తర తెలంగాణలో.. ఇటు దక్షిణ తెలంగాణలోనూ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే వస్తాయన్న ఆందోళన ఉంది. బీజేపీ కలుపుకునే అవకాశం లేదు కాబట్టి మెల్లగా కాంగ్రెస్ వైపు వెళ్లే ప్రయత్నంలో ఓ అడుగు చెన్నైలో పడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది ముందు ముందు జరగబోయే పరిణామాలు తదుపరి రాజకీయ దశా, దిశను మార్చే అవకాశం ఉంది