- Advertisement -
విద్యుత్ షాక్ తో ట్రాక్టర్ లోడ్ గడ్డి దగ్దం
Tractor load hay got fired with electric shock
పరిగి
ఊరు నిండా లీడర్లు ఒక్క సమస్య తీరదు ఇదేమి విచిత్రమో… అంటూ గ్రామంలో ట్రాక్టర్ లోడ్ గడ్డివాము తగలబడిపోవడంతో ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో విద్యుత్ వైర్లు తగిలి ట్రాక్టర్ లో ఉన్న గడ్డివాము లోడు పూర్తిగా దగ్ధమైంది. ఫైర్ ఇంజన్ వచ్చినా లాభం లేకుండా పోయింది. విద్యుత్ వైర్లు చాలా కాలం నుంచి కిందకు ఉన్నాయని పలుమార్లు విద్యుత్ ఏఈకి ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో విద్యుత్ షాక్ గురై గడ్డివాము పూర్తిగా దగ్ధమైందని రైతులు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ఏ ఈ పై చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు
- Advertisement -