బోయిన్పల్లిలో విషాదం..  కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య!

- Advertisement -

సికింద్రాబాద్: బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని భవానీనగర్లో విషాదం నెలకొంది. ఓ ఇంట్లో ఇద్దరు చిన్నారులతో కలిసి తండ్రి ఆత్మహత్య చేసుకన్నారు. మృతదేహాల పక్కనే నిద్రమాత్రలు వున్నాయి. గురువారం  రాత్రి భోజనం చేసిన తరువాత  వీరు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను శ్రీకాంత్ చారి (42), స్రవంతి (8), శ్రావ్య(7)గా గుర్తించారు.

Tragedy in Boinpally.. Father commits suicide with daughters!
Tragedy in Boinpally.. Father commits suicide with daughters!

శ్రీకాంత్ చారి భార్య అక్షయ మాట్లాడుతూ భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు లేవు. 👉రాత్రి భోజనం చేసిన అనంతరం అందరం ఒకే దగ్గర పడుకున్నాము. అర్ధరాత్రి సమయంలో నీళ్లు తాగినందుకు తన భర్త లేచినట్లు తెలిపింది. ఉదయం లేచి చూసేసరికి విగత జీవులుగా పడి ఉండడంతో దిగ్భ్రాంతికి గురయ్యాము. మాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని చెప్పింది.

Tragedy in Boinpally.. Father commits suicide with daughters!
Tragedy in Boinpally.. Father commits suicide with daughters!

మృతుడి తల్లి జయమ్మ మాట్లాడుతూ కుటుంబమంతా కలిసి ఉంటాము.. అందరం మాట్లాడుకుని రాత్రి పడుకున్నాము. కుటుంబ కలహాలు లేవు.. ఉదయాన్నే వారిని లేపే సరికి స్పృహ కోల్పోయి ఉన్నారు.. ఇద్దరు కూతుర్లు శ్రావ్యా స్రవంతి తో పాటు శ్రీకాంత్ నిద్ర మాత్రలు మింగారు.. గత కొంతకాలంగా శ్రీకాంత్ సిల్వర్ వర్క్ సరిగా నడవడం లేదని వెల్లడించింది.

Tragedy in Boinpally.. Father commits suicide with daughters!
Tragedy in Boinpally.. Father commits suicide with daughters!
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular