Wednesday, January 15, 2025

మధురై రైల్వే స్టేషన్‌లో రైలులో మంటలు

- Advertisement -

తమిళనాడులో ఘోర రైలు ప్రమాదం

చెన్నై, ఆగస్టు 26:  తమిళనాడులోని ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం తెల్లవారుజామువ 5.15 AM గంటల సమయంలో మధురై రైల్వే స్టేషన్‌లో ఆగిఉన్న ఓ రైలుబోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది దుర్మరణం చెందారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందో కూడా అధికారులు తెలిపారు. అక్రమంగా రైల్లోకి తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు దక్షిణ రైల్వే అధికారులు తెలిపారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ ప్రైవేట్ పార్టీ కోచ్ ఆగస్టు 17న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే శుక్రవారం రోజున నాగర్‌కొయిల్ జంక్షన్ వద్దకు రాగానే దీన్ని పునలూరు-మదుపై ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుసంధానం చేశారు. నిన్ని రాత్రిపూట మదురై రైల్వేస్టేషన్ వద్ద దీన్ని వేరు చేసి స్టాబ్లింగ్ లైన్‌లో నిలిపి ఉంచారు.అయితే ఈ ప్రైవేట్ పార్టీ కోట్‌లో ప్రయాణిస్తున్నవారిలో ఒకరు రహస్యంగా గ్యాస్ సిలిండర్‌ను రైల్లోకి తీసుకొచ్చారు. ఇక శనివారం తెల్లవారుజామున దానిపై టీ చేస్తున్నారు. అలా చేస్తుండగా ఒక్కసారిగా అది పేలిపోయింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అలా చూస్తూ ఉండగానే బోగీ అంతటా కూడా మంటలు వేగంగా విస్తరించాయి. కొందరు ప్రయాణికులు మంటలు వ్యాప్తి చెందడాన్ని గమనించారు. వెంటనే బోగీ నుంచి కిందకి దిగిపోయారు. మరికొందరు అందులోనే చిక్కుకుపోయారు. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ బోగీలో 65 మంది ప్రయాణికులు ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా ఈ దుర్ఘటనపై రైల్వే శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఇదిలా రైల్వేశాఖ చట్టాల ప్రకారం గ్యాస్ సిలిండర్లు, యాసిడ్, కిరోసిన్, స్టవ్, పెట్రోల్, టపాకాయలు, థర్మిక్ వెల్టింగ్ వంటి పేలుడు వస్తువులను వెంటబెట్టుకొని రైళ్లో ప్రయాణించడం నేరం. అందుకే దక్షిణ మధ్య రైల్వే ఇలాంటి మండే/పేలుడు వస్తువులతో రైళ్లో ప్రయాణాలు చేయకూడదని కోరుతోంది. కానీ కొంతమంది ఈ విషయంపై అవగాహన లేక అలాంటి వాటిని వెంటబెట్టుకోని ప్రయాణాలు చేస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ రైలు ప్రమాదంలో మృతి చెందిన బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒకరు చేసిన చిన్న తప్పు వల్ల ఇంత ఘోరంగా రైలు ప్రమాదం జరగడం అలాగేే 10 మంది వరకు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Train caught fire at Madurai railway station
Train caught fire at Madurai railway station

తలుపులు పగలుకొట్టి

తమిళనాడులోని మదురైలో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న రైల్లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. రెండు కంపార్ట్‌మెంట్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా…20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు రైల్లోనే గ్యాస్ సిలిండర్‌ ఆన్ చేసి కాఫీ పెట్టేందుకు ప్రయత్నించగా మంటలు వ్యాపించాయి. అప్పటికప్పుడు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి 55 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మంటలు వ్యాపించిన వెంటనే ప్రయాణికులంతా ప్రాణాలు కాపాడుకోటానికి పరుగులు పెట్టారు. ఫలితంగా…చాలా సేపటి వరకూ రైల్వే స్టేషన్‌లో అలజడి రేగింది. అయితే…ఈ ప్రమాదానికి కారణాలేంటో అధికారులు విచారణ జరిపి వెల్లడించారు. “ఉదయం 5.30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. మదురై రైల్వే స్టేషన్‌లో రైల్ ఆగి ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. యూపీ నుంచి వచ్చిన భక్తులు ఈ కోచ్‌లలో ఉన్నారు. తమతో పాటు తెచ్చుకున్న గ్యాస్‌స్టవ్‌ని ఆన్‌ చేశారు. కాఫీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. సిలిండర్ పేలింది. 9 మంది చనిపోయారు. వాళ్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం”ఈ ప్రమాదం నుంచి బయట పడ్డ ప్రయాణికులు ఇంకా షాక్‌లో నుంచి తేరుకోలేదు. తమకు ఎదురైన ఆ అనుభవాన్ని తలుచుకుంటూ వణికిపోతున్నారు. ఏ మాత్రం ఆలస్యమైనా తామూ మంటల్లో పడి బూడిదైపోయే వాళ్లమని చెబుతున్నారు. “నేను సీట్‌లో కూర్చుని ఉన్నాను. ఒక్కసారిగా ప్రయాణికులంతా భయపడిపోయారు. మంటలు వ్యాపిస్తున్నాయని అప్పుడర్థమైంది. వెంటనే పరుగులు తీసి కిటికీ దగ్గరికి వెళ్లాం. కానీ అది లాక్ చేసి ఉంది. ఏదోలా కష్టపడి ఆ కిటికీ తెరిచాం. వెనకాల కూర్చున్న వాళ్లంతా పలుగులు పెట్టారు. కొంత మంది మాత్రం అలాగే చిక్కుకుపోయారు. కొందరు తలుపులు పగలగొట్టి బయటకు వచ్చారు. లగేజ్ అంతా ట్రైన్‌లోనే విడిచిపెట్టి ప్రాణాలు దక్కించుకున్నాం” – ప్రయాణికులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్