Friday, February 20, 2026

వాయిస్ కమాండ్ తో ట్రైన్ టిక్కెట్స్

- Advertisement -

వాయిస్ కమాండ్ తో ట్రైన్ టిక్కెట్స్

Train tickets with voice command
ముంబై, సెప్టెంబర్ 4 న్యూస్ పల్స్)

భారతదేశంలోని కస్టమర్‌లు ప్రస్తుతం యూపిఐ లావాదేవీలను వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి లేదా వారి యూపిఐ  ఐడి లేదా మొబైల్ నంబర్‌ని టైప్ చేయడం ద్వారా పూర్తి చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కోరోవర్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఈ వాయిస్‌ కమాండ్‌ చెల్లింపు ఫీచర్‌ను ప్రారంభించింది. వివరాల్లోకెళ్తే..సాధారణంగా మనం రైలు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్ ఓపెన్ చేయాలి.. అందులో తేదీ, ఏ ట్రైన్, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడ దిగాలి వంటి వివరాలు నింపాల్సి ఉంటుంది. అంతా అయ్యాక చివర్లో టికెట్ పేమెంట్ కోసం డెబిట్ కార్టు లేదా యూపిఐ పేమెంట్ కోసం ప్రాసెస్‌ ఉంటుంది. ఈ ప్రక్రియ నంతా యూజర్లు టైప్ చేస్తూ ఉండాలి. ఇప్పుడా సమస్య లేకుండా వాయిస్ కమాండ్‌తో రైలు టికెట్ బుకింగ్, టికెట్ పేమెంట్ చేసేయొచ్చు.దేశంలో  యూపిఐటెక్నాలజీని నియంత్రిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , ఇండియన్ రైల్వేస్, కో రోవర్ అనే టెక్నాలజీ కంపెనీ.. ఈ మూడు సంస్థలు కలిసి ముంబై లో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ 2024 లో రైలు టికెట్ బుకింగ్ కోసం వాయిస్ తో యూపిఐ పేమెంట్ చేసేవిధంగా ఒక ఫీచర్‌ను లాంచ్ చేశారు. దీన్ని కన్వర్జేషనల్ వాయిస్ పేమెంట్స్ అని అంటారు. రైలు టికెట్ బుకింగ్ చేసుకునే యూజర్ తన యుపిఐ ఐడి, లేదా మొబైల్ నెంబర్‌ని వాయిస్‌తో చెప్పి టికెట్ పేమెంట్ సులువుగా పూర్తి చేయవచ్చు. ఈ సిస్టమ్ మొబైల్ నెంబర్ తో డిఫాల్ట్ గా లింక్ ఉన్న యుపీఐ ఐడీని కనెక్ట్ చేసి సంబంధిత యూపీఐ యాప్ పేమెంట్ ప్రారంభిస్తుంది.ఈ కొత్త వాయిస్ కమాండ్ ఫీచర్  లోని ఏఐ అసిస్టెంట్ ఆస్క్ దిశతో లింక్ అయి ఉంటుంది. యూజర్లు టికెట్ బుక్ చేసుకోవడం కోసం పేమెంట్ చేసే సమయంలో ఈ ఫీచర్ పనిచేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి వాయిస్ కమాండ్ టికెట్ బుకింగ్ ఏఐ ఫీచర్ ఇది. సులభంగా లావాదేవీలు పూర్తి చేయడం కోసం యూజర్‌ ఫ్రెండ్లీగా దీన్నీ తీర్చిదిద్దారు. ఈ ఏఐ టెక్నాలజీ వాయిస్ అసిస్టెంట్ హిందీ, గుజరాతీ, సహా ఇతర భాషల్లో కూడా అందుబాటులోకి ఉంటుంది. యూపీఐ పేమెంట్‌తో పాటు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, ఇలా అన్ని రకాల పేమెంట్స్ కూడా ఈ వాయిస్ ఫీచర్ ద్వారా పూర్తిచేసే విధంగా రూపొందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్