రైతుసేవా కేంద్ర సిబ్బంది నైపుణ్య పెంపుదలపై శిక్షణా కార్యక్రమం
Training program on skill enhancement of Rythu Seva Center staffపిడుగురాళ్ళ ఎ డి ఎ కృష్ణదేవరాయలు
మాచవరం,
పల్నాడు జిల్లా మండల కేంద్రమైన మాచవరం ఎంపీడీవో ఆఫీసు నందు పిడుగురాళ్ళ సబ్ డివిజను రైతుసేవా కేంద్ర సిబ్బంది నైపుణ్య పెంపుదలపై శిక్షణా కార్యక్రమం జిల్లా వనరుల కేంద్రం, నరసరావుపేట వారిచే పిడుగురాళ్ళ ఎ డి ఎ కృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. శిక్షణా కార్యక్రమంలో జిల్లా శిక్షణా కోఆర్డినేటర్ ఎం. శివ కుమారి ప్రత్తి లో గులాబీ రంగు పురుగు, రసం పీల్చు పురుగుల యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తూ ప్రత్తి లో గులాబీరంగు పురుగు వల్ల మన ప్రాంతంలో ప్రత్తి విస్తీర్ణం తగ్గిపోతోందని, ఈ పురుగు అదుపునకు లింగాకర్షక బట్టలు పెట్టడం, జెల్ టెక్నాలజీ మరియు రోప్ టెక్నాలజీ వాడుకోవాలని, మొదటగా గుడ్ల మీద పనిచేసే వేప సంబంధిత మందులు, ప్రొఫెనోఫోస్ వాడాలని తెలిపారు. జంగమహేశ్వరపురం శాస్త్రవేత్త సైదా నాయక్ మాట్లాడుతూ, వరి పంటలో, కంది పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు గురించి వివరించారు. వరిలో నేరుగా విత్తే పద్ధతి పాటించడం, కంది లో కాయ ఈగ పట్ల అప్రమత్తంగా ఉండడం చేయాలని తెలిపారు. వరి లో రైతులు ఆకుముడత కనబడగానే మందులు వాడుతున్నారని, చిరుపొట్ట దశ వరకు దీని గురించి భయపడవలసిన అవసరం లేదని, ఒకవేళ పురుగు ఉధృతి అధికంగా వుంటే ఫ్లుబెండి అమైడ్ 0.2 గ్రాములు లేదా కార్టాప్ హైడ్రో క్లోరైడ్ 2 గ్రాములు లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలని తెలిపారు. వ్యవసాయ అధికారి ప్రవీణ్ క్రాప్ లైఫ్ సిస్టమ్ యాప్ గురించి వివరించారు.
శిక్షణా కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు బి.శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ, ప్రతి రైతు పంటను సెప్టెంబర్ 23వ తేదితో ముగుస్తున్నందున అందరూ పంట నమోదు చేసి ఈ కేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఉచిత పంట భీమా వర్తించడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,డి.పాప కుమారి,కే. దేవ దాసు,కే.రామమ్మ, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.




