- Advertisement -
వరంగల్: తెలంగాణ శాసనసభకు వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో తొలిసారి ఒక ట్రాన్స్జెండర్ బరిలో దిగుతున్నారు. బీఎస్పీ పార్టీ టికెట్పై పోటీచేయబోతున్నారు. ఆ పార్టీ 43 మంది అభ్యర్థులతో తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో వరంగల్ తూర్పు స్థానాన్ని పుష్పిత లయకు కేటాయించింది.
43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కల్పించారు. వరంగల్ కరీమాబాద్ నివాసి అయిన పుష్పిత ట్రాన్స్జెండర్. బీఎస్పీలో యాక్టివ్గా ఉంటున్నారు. ఆమెకు టికెట్ రావడంతో హిజ్రాలు సంబరాలు చేసుకుంటున్నారు.
- Advertisement -