ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హన్మకొండ
Transport and BC Welfare Minister Ponnam Prabhakar Hanmakonda was the chief guest
హనుమకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మార్కేట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం.
ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హన్మకొండ
కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా తౌటం ఝాన్సీ రాణి రవీందర్, వైస్ చైర్మన్ దేశినీ ఐలయ్య, పాలక వర్గ సభ్యులతో జిల్లా వ్యవసాయ అధికారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమ్ఆనికి హజరయిన మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కమలాపూర్ నూతన పాలక వర్గానికి చైర్మన్ తౌటం ఝాన్సీ రవీందర్ కి హృదయ పూర్వక శుభాకాంక్షలు.. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఝాన్సీ రాణి చైర్మన్ ,ఐలయ్య వైస్ చైర్మన్ గా నియమయించబడింది.. భుత్వం ఏర్పడిన వెంటనే అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.రైతులకు రైతు భరోసా పై కొండలు ,గుట్టలు ,ఫ్లాట్ లకు కాకుండా నిజమైన రైతులకు ఇవ్వాలని సబ్ కమిటీ వేసింది.నివేదిక రాగానే రైతు భరోసా ఇస్తాం.2 లక్షల రైతు రుణమాఫీ చేశాం. రానివారికి కుటుంబ నిర్ధారణ జరుగుతుందని అన్నారు.
2 లక్షల పైన ఉన్న వారికి పైన డబ్బులు కట్టితే 2 లక్షల వరకు రుణమాఫీ జరుగుతుంది.సన్న వడ్ల కి 500 బోనస్ ఇస్తున్నాం.. రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయి.రైతులకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. కాళేశ్వరం కట్టిన తరువాతనే నీళ్లు పంటలు అన్న మాదిరిగా చేశారు. కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం వస్తుంది. ప్రభుత్వం రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్ అందిస్తున్నాం .ఎవరికైనా రాకపోతే మండల ఆఫీస్ లో పిర్యాదు చేయండి.ఈ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం.గురుకుల పాఠశాలలో 40 శాతం మెస్ ఛార్జీలు,కాస్మొటిక్ చార్జీలు పెంచాం..రైతులకు ఎక్కడ కరెంట్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయి. సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు చేస్తం.10 ఏళ్లలో బీజేపీ ,brs ఇచ్చిన హామీలు ఎన్ని..ఎన్ని అమలు చేశారు..ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నాం..11 నెలల్లో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం..మహరాష్ట్ర లో బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడితే సంతోష పడుతున్నారు.రైతు బిడ్డగా ,మార్క్ ఫెడ్ చైర్మన్ గా చేశా. రైతుల సమస్యలు అన్ని తెలుసు. మీకు అండగా ఉంటానని అన్నారు.