కారు ఇండికేటర్ హెడ్లైట్ లలో గంజాయి రవాణా

- Advertisement -

పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా.

భద్రాద్రి కొత్తగూడెం, వాయిస్ టుడే

పాల్వంచ మిదుగ పుష్ప సినిమా తరహలో రవాణా చెస్తున్న గంజాయి ని

Transportation of marijuana in car indicator headlights
Transportation of marijuana in car indicator headlights

ఆర్టిఏ చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో ఆధికారులు పట్టుకున్నారు.  చతిస్గడ్ నుంచి వస్తున్న కారును తనిఖీ చేయటంతో  గంజాయి ఉన్నట్లు అదికారులు గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకొని పాల్వంచ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు.  కారు సైడ్ డోర్ ,  ఇండికేటర్ హెడ్లైట్ లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలమరల్లో కేజీ ప్యాకింగ్ గల 108 కేజీల గంజాయి ప్యాకెట్లను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు పట్టుబడిన ఇద్దరు నిందితులు ఢిల్లీ నుండి ఒరిస్సాకు రైలు మార్గం నుండి మల్కాజ్గిరి చేరుకొని అక్కడ గంజాయిని కేజీ 2000 చొప్పున కొనుగోలు చేసి చతిస్గడ్ లో కారుని తీసుకొని భద్రాచలం మార్గం ద్వారా ఢిల్లీకి వెళ్తున్న క్రమంలో పాల్వంచ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు.. నిందితులు విజయపాల్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వాడు, జిత్తు కుమార్ సెంట్రల్ ఢిల్లీ చెందినవాడుగా గుర్తించారు. ఈ గంజాయిని ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలకు కేజీ 20,000 చొప్పున అమ్ముతున్నారని అధికారుల విచారణలో తేలింది.  ఈ దాడుల్లో ఖమ్మం జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి తిరుపతిరావు,పాల్వంచ సీఐ గురునాథ్ రాథోడ్  ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular