Tuesday, April 29, 2025

పాదయాత్రల ట్రెండింగ్ పోయి,…అరెస్ట్ ల ట్రెండింగ్…

- Advertisement -

పాదయాత్రల ట్రెండింగ్ పోయి,…అరెస్ట్ ల ట్రెండింగ్…

Trending of padhayatra gone, trending of arrests...

హైదరాబాద్, నవంబర్ 25, (న్యూస్ పల్స్)
ఒకప్పుడు పాద యాత్ర చేసిన నేతలు సీఎం అవుతారు అన్న సెంటిమెంట్‌ ఉండేది. రెండు దశాబ్దాలుగా.. అరెస్టు అయితే సీఎం అవుతారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది నిరూపితమవుతోంది.రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలనుకుంటుంది. ఇందు కోసం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతాయి. ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇవ్వడం ద్వారా, మేనిఫెస్టో ప్రకటించడం ద్వారా ప్రజలు పార్టీలను గెలిపిస్తారు. అయితే 2004 నుంచి ట్రెండ్‌ మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్ర చేశారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పాదయాత్ర సెంటిమెంట్‌గా మారింది. 2009లోనూ మరోమారు కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చారు. ఇక 2013 జగన్‌ కూడా పాదయాత్ర చేశారు. కానీ విభజిత ఏపీకి సీఎం కాలేదు. అయితే తర్వాత జగన్‌ అరెస్ట్‌ అయ్యారు. దీంతో 2019లో ఏపీలో భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించారు. జగన్‌ సీఎం అయ్యారు. అప్పటి నుంచి అరెస్ట్‌ అయిన నేతలు సీఎం అవుతారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 20015లో తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం నాడు టీడీపీ నేతగా ఉన్న రేవంత్‌రెడ్డిని అరెస్టుచేయించింది. తర్వాత రాజకీయ పరిణామాలతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆయన 2023లో సీఎం అయ్యారు. ఇక 2023లో ఏపీ సీఎం జగన్‌ చంద్రబాబు నాయుడును అరెస్టు చేశారు. స్కిరల్‌ కేసులో 50 రోజులు జైల్లో పెట్టారు. దీంతో 2024లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.

సోరెన్‌కు కలిసి వచ్చిన అరెస్ట్‌..
తాజాగా జార్ఖండ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేఎంఎం ఆధ్వర్యంలోని కూటమి విజయం సాధించింది. ఇందుకు మనీ ల్యాండరింగ్‌ కేసులో ఆయనను ఈడీ అరెస్టు చేయడమే కారణమని భావిస్తున్నారు. 2024, జనవరి 31న ఈడీ హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేసింది. జూన్‌లో ఆయనకు బెయిల్‌ వచ్చింది. ఆరు నెలలపాటు ఆయన జైల్లో ఉన్నారు. ఈ సమయంలో చంపైన్‌ సోరేన్‌ తాత్కాలిక సీఎంగా ఉన్నారు. హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌పై బయటకు వచ్చాక మళ్లీ సీఎం బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలోనే జేఎంఎం ఎన్నికలకు వెళ్లింది. 2019 ఎన్నికల్లో సొంతంగా అధికారంలోకి వచ్చిన జేఎంఎం.. ఈసారి కూటమిగా అధికారంలోకి వచ్చింది. దీంతో అరెస్టు కావడం ద్వారానే జేఎంఎం విజయానికి కారణం అన్న విశ్లేషణ జరుగుతోంది.

ఢిల్లీలో ఆప్‌ అధికారంలోకి వచ్చేనా..?
అరెస్టు అయిన నేతలు మళ్లీ సీఎం అవుతున్న సెంటిమెంట్‌ నేపథ్యంలో 2025, ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. కేజ్రీవాల్‌ను మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసింది. సుమారు రెండు నెలలు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్న సమయంలో సీఎంగా కొనసాగిన కేజ్రీవాల్‌.. బయటకు వచ్చాక రాజీనామా చేశారు. అతిషికి సీఎం పగ్గాలు అప్పగించారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతన్నారు. 11 మందితో తొలి జాబితాను ప్రకటించారు. ఇప్పటికే ఆప్‌ను మూడుసార్లు గెలిపించిన ఢిల్లీ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కడతారో చూడాలి. అరెస్టు సెంటిమెంట్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు కలిసి వస్తుందో లేదో ఫిబ్రవరిలో తేలిపోతుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్