ఎమ్మెస్ స్వామినాథన్ మరణం దేశానికి తీరని లోటు….
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట: సెప్టెంబర్ 29 (వాయిస్ టుడే జిల్లా ప్రతినిధి వైవి): భారత హరిత విప్లవ సారధి, వ్యవసాయ శాస్త్రవేత్తడాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి దేశానికి తీరని లోటు అని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శుక్రవారంఇటీవల మరణించినప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్. ఎస్. స్వామినాథన్ చిత్రపటానికి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1965 నుండి1985 వరకు హరిత విప్లవాని కొనసాగించి దేశాన్ని స్వయం సమృద్ధిగా చేసిన శాస్త్రవేత్తగా స్వామినాథన్ గొప్ప శాస్త్రవేత్త అన్నారు.1965 స్వామినాథన్ ఆధ్వర్యంలో హరిత విప్లవం ప్రారంభించారని అన్నారు.వరి, గోధుమల అధికోత్పత్తి వంగడాల వినియోగం ద్వారా విత్తన వినియోగంలోపెను మార్పులు తెచ్చారని అన్నారు.భూ సంస్కరణల అమలుకృషి చేశారని అన్నారు. ఆహార ధాన్యాల లోటులో ఉన్నదేశం1985 నాటికి ఎగుమతి చేసే దేశంగా ఎదిగేలా కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు.1988 సంవత్సరంలో ఎమ్మెస్ స్వామినాథన్ పరిశోధన సంస్థలు స్థాపించారని అన్నారు. స్వామినాథన్ చైర్మన్ భారత ప్రభుత్వం జాతీయ రైతుల కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకువచ్చి దేశ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంలో ఆయన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, మట్టి పెళ్లి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, కొప్పుల రజిత, చిన్నపంగా నరసయ్య, నాయకులు వల్లపు దాసు సాయికుమార్, మామిడి సుందరయ్య, రాజుతదితరులు పాల్గొన్నారు.