ఆచార్య జయశంకర్ కు నివాళులు
Tributes to Acharya Jayashankar
కరీంనగర్
ఆచార్య జయశంకర్ జయంతిని పురస్కరించుకుని కలెక్టర్ పమేలా సత్పతి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బడుగు బలహీన వర్గాల జీవితాలు బాగుపడతాయని అహర్నిశలు శ్రమించిన గొప్ప వ్యక్తి ఆచార్య జయశంకర్ సార్ అని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు..తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు ప్రత్యేక రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడారని వారి సేవలు మరువలేనివని అన్నారు. తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి మలిదశ ఉద్యమానికి దిక్సూచిగా ఆయన నిలబడ్డారని కొనియాడారు.
తెలంగా తెలంగాణ ఉద్యమం కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. స్వచ్చదనం- పచ్చదనం కార్యక్రమాల్లో అధికారులు చురుకుగా పాల్గొనాలని అధికారులను సూచించారు .
ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ మహేశ్వర్ , బీసీ వెల్ఫేర్ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



