కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన కాట్రావత్ గోపాల్ నాయక్
కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
ఎల్బీనగర్, వాయిస్ టుడే;
తెలంగాణ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కలమడుగు రాజేందర్ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో యూనియన్ జిహెచ్ఎంసి ప్రెసిడెంట్ కాట్రావత్ గోపాల్ నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాట్రావత్ గోపాల్ నాయక్ కు బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పి మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాట్రావత్ గోపాల్ నాయక్ మాట్లాడుతూ స్వచ్ఛ ఆటో టిప్పర్స్ డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హంస రాజు, అంబర్ పేట్ అర్జున్, ఫలక్‌నామా శేఖర్, పరుశురాం, ప్రవీణ్ కుమార్, రేణు కుమార్, మచ్చ గిరి, రవి, నాయకులు పాల్గొన్నారు.



