- Advertisement -
భోగాపురంలో దిగ్గజ సంస్ధ జీఎంఆర్ నిర్మిస్తున్న నూతన విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చెన్నై – కోల్కతా జాతీయ రహదారికి ఆనుసంధానించడం కోసం ఎనిమిది ఆకారంలో ట్రంపెట్ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేపట్టనున్నట్టు సంస్ధ వెల్లడించింది.
దీనికోసం ఇప్పటికే 25ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి సంస్ధకు అప్పగించింది. విమానాశ్రయం కోసం విద్యుత్ సబ్ స్టేషన్ పనులు కోసం 6ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వం అందజేసింది.
- Advertisement -



