దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ తనిఖీలు

- Advertisement -

దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ తనిఖీలు

TTD Chairman checks on Darshan Qlines

తిరుమల,
తిరుమలలోని శ్రీవారి దర్శన క్యూలైన్లలో టీటీడీ చైర్మన్ శ్రీ బి.ఆర్.నాయుడు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ముందుగా ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వ దర్శన క్యూలైన్లను పరిశీలించి నారాయణగిరి షెడ్ల వద్దకు చేరుకున్నారు. అనంతరం ఫుట్ పాత్ హాల్ (దివ్యదర్శనం)ను తనిఖీ చేసి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ లో టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కొందరు భక్తులు లడ్డూలు రుచికరంగా, నాణ్యంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

మరికొందరు భక్తులు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనంలో తమకు దర్శనం మరింత త్వరగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు చేయాలని చైర్మన్ ను కోరారు.

క్యూలైన్ల విధానం, దర్శన సమయం వంటి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన ఏర్పాట్లు చేపడతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, వైకుంఠం ఏ వి ఎస్ ఓ శ్రీ విశ్వనాధ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular