టీటీడీ చైర్మన్ గాశ్రీ బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం

- Advertisement -

టీటీడీ చైర్మన్ గాశ్రీ బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం

TTD Chairman Gashri BR Naidu took oath

తిరుమల,
తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా  బి.ఆర్.నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ  బి.ఆర్.నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ భూ వరహాస్వామిని దర్శించుకున్నారు.  అనంతరం ఆయన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి ఆలయానికి విచ్చేశారు.

ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ అధికారులు   బి.ఆర్.నాయుడుకు స్వాగతం పలికారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద టీటీడీ ఈవో  జె.శ్యామలరావు   బి.ఆర్.నాయుడు తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకోగా రంగ నాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం, టీటీడీ డైరీలు, క్యాలెండర్ లు అందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular