మరో రెండు నూతన సచివాలయాలు ప్రారంభం – మేయర్ శిరీష, కమిషనర్ హరిత
తిరుపతి: తిరుపతి నగరంలోని రైల్వే కాలనీ, రాయల్ నగర్లో నూతనంగా నిర్మించిన రెండు సచివాలయ భవనాలను గురువారం టిటిడి చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రజల వద్దకు ప్రభుత్వ సేవలను నేరుగా తీసుకెల్లాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగిందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు అన్ని సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల ద్వారా ప్రజలకు సకాలంలో అందుతున్నాయని మేయర్ డాక్టర్ శిరీష తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత మాట్లాడుతూ ప్రజలకు తమ ప్రాంతాల్లోనే సచివాలయ సేవలు అందేలా సచివాలయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరమనుకున్న చోట్ల నూతన భవనాలు నిర్మిస్తున్నామన్నారు. అందులో భాగంగ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రైల్వే కాలనీలో 34, 35 డివిజన్లకు సంబందించి 64.75 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని, అదేవిధంగా 18 డివిజన్ రాయల్ నగర్లో 58.55 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించడం జరిగిందని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ మాట్లాడుతూ నగరాభివృద్ధికి తమ కౌన్సిల్ నిరంతర కృషి చేస్తున్నదని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రావణిమునిరామిరెడ్డి, ఆర్.సి.మునికృష్ణ, సులోచనాశేఖర్ రెడ్డి, వరికుంట్ల నారాయణ, మోహన్ యాదవ్, మునిసిపల్ ఇంజనీర్లు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర్, డీఈలు శ్రావణి, మహేష్, నాయకులు మునిరామి రెడ్డి, శేఖర్ రెడ్డి, దినేష్ రాయల్, చంధు రాయల్, పడమటి కుమార్, నాగిరెడ్డి, స్టోర్ నాధముని, మబ్బునాధముని రెడ్డి, అశోక్ కుమార్ రెడ్డి, అనీల్ రాయల్, మాకం చంద్ర, బసవ బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.