రిపోర్టర్ మంచర్ల నర్సింగ్ రావు కు టీయూడబ్ల్యూజే నాయకుల పరామర్శ..
TUWJ leaders consult reporter Mancharla Narsing Rao..
శేరిలింగంపల్లి నవంబర్ 30 (వాయిస్ టుడే): గుండెపోటుకు గురై శంషాబాద్ లోని లిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సీనియర్ రిపోర్టర్ మంచర్ల నర్సింగ్ రావు ను రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎండీ సలీమ్ పాషా,ఉపాధ్యక్షులు ఏ భీమయ్య, జిల్లా ఎలాక్ట్రానిక్ మీడియా కార్యదర్శి శ్రీనివాస్, రాజేంద్రనగర్ నియోజకవర్గ అధ్యక్షులు మేకల దామోదర్ రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ ఆలీ పరామర్శించారు. ఈ సందర్బంగా నర్సింగ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన సతీమణి, సోదరులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వటంలో జాప్యం చేయటం వల్ల జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పై హెల్త్ కార్డులు,ఆక్రిడేషన్లు, ఇళ్ల స్థలాల పై డిసెంబర్ 3 న చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు.తొలిసారి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులకు రాజేంద్ర నగర్ నియోజకవర్గ జర్నలిస్టుల తరుపున స్వాగతం పలికారు.రాష్ట్ర అధ్యక్షులను కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు మనోహర్,మహాముద్ ఆలీ ఖాన్, మహేందర్, మధు,ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.



