ఇద్దరు అంతర్జిల్లా దొంగలు అరెస్టు

- Advertisement -

ఇద్దరు అంతర్జిల్లా దొంగలు అరెస్టు

Two inter-district thieves arrested

అనకాపల్లి
అనకాపల్లి, విజయనగరం జిల్లాలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను పరవాడ పోలీసులు అరెస్టు చేశారని జిల్లా ఎస్పీ  దీపికా పాటిల్ అన్నారు. అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ దీపిక పాటిల్ మాట్లాడుతూ పరవాడ, మరియు సిసిఎస్ పోలీసులు,  విశాఖపట్నంకు చెందిన వడ్డాది పోలరాజు, చినామనా ఎల్లాజీ అనే ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి విజయనగరం రూరల్, పరవాడ, అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోరీలకు సంబంధించి 12 లక్షలు. రూపాయలు విలువచేసే 17తులాల బంగారు నగలు స్వాదీనం చేసుకున్నమన్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పరవాడ మరియు సిసిఎస్ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ, పరవాడ డిఎస్పి, సిఐ, ఎస్సై, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular