- Advertisement -
గోవా కర్రలు విగిరి ఇద్దరు కూలీలు మృతి
మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి: కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్ట సొసైటీ కాలనీలో విషాద ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైనుంచి నలుగురు కార్మికులు ప్రమాదవశాత్తు కింద పడ్డారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ప్రతిమ హాస్పిటల్ లో కు తరలించారు. భవనం లోని ఆరవ అంతస్తులు పిట్టగోడ నిర్మాణ పనులు కొనసాగుతుండగా ప్రమాదం జరిగింది. పిట్టగోడతోపాటు గోవా కరలు కూడా విరిగి కార్మికులు కింద పడిపోయారు. మృతి చెందిన కార్మికులు, గాయపడ్డ కార్మికుల వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -