రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..ఒక డ్రైవర్ మృతి

- Advertisement -

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..ఒక డ్రైవర్ మృతి
పలువురికి గాయాలు
హైదరాబాద్

Two separate road accidents..one driver died

తెలంగాణలో  జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లా బురెడ్డిపల్లి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని ధర్మవరం వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు డీసీఎంను ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్తో పాటు 15 మందికి గాయాలయ్యా యి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు.
మరో ప్రమాదం  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం గోమ్మూరు వద్ద జరిగింది. సోమవారం తెల్లవారుజామున కొత్తగూడెం నుండి భద్రాచలం వస్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి చెందాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular