- Advertisement -
హిట్ టాక్ సాధించుకున్న ‘ఉక్కు’
'Ukku' achieved hit talk
విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రపంచ స్ధాయికి తీసుకెళ్లిన ఉక్కు సత్యాగ్రహం చిత్రం ఉద్యమకారుల్లో నూతనోత్తేజాన్ని నింపుతోంది.32 మంది ప్రాణత్యాగంతో సాదించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఉద్యమాన్ని పతాకస్ధాయికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమ స్పూర్తిని రగిల్చేలా నిర్మించిన చిత్ర ప్రజల మన్ననలు పొందుతూ హిట్ టాక్ ను సాధించుకుంది.చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన నిర్మాత, దర్శకుడు , హీరో సత్యారెడ్డి విశాఖలో సిపిఎం నాయకులు, ఉద్యమనాయకులు, స్టీల్ ప్లాంట్ నాయకులు, చిత్రంలో నటించిన నటి నటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి `ప్రేరణ అని అన్నారు.విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో ఉద్యమకారుల త్యాగాలు ప్రజలకు తెలియచేస్తూ 32 మంది ప్రాణ త్యాగాలు తో నిర్మిత మైన సినిమా ఉక్కు సత్యాగ్రహం అని తెలిపారు. ప్రజా యుద్ద నౌక , విప్లవ కవి గద్దర్ ఆఖరి చిత్రం అని చెప్పారు.పక్క రాష్ట్రాల్లో కూడా ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని సినిమా విజయానికి అదే కారణం అన్నారు.ప్రవేటీకరణను ఆపే ఏకైక సిద్ధాంతాన్ని సినిమా క్లయిమాక్స్ లో చూపించామని అన్నారు.నటుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ను సాధించుకున్నామని ప్రైవేటీకరణ అడ్డుకుంటామని చెప్పారు. మంచి సందేశంతో సత్యారెడ్డి చిత్రాన్ని తీశారని అన్నారు.
- Advertisement -