
ఉలిక్కిపడ్డ ఉప్పాడ అందరినీ అలరించే చిత్రమని హాస్యనటుడు గౌతమ్ రాజ్ పేర్కొన్నారు. చిత్రం చిత్రీకరణ ముగించుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ విలేకరుల సమావేశంను నగరంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఉన్న పింఛన్దారుల భవనంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గౌతంరాజు మాట్లాడుతూ,,,, మత్స్యకారుల జీవన విధానంపై ఇప్పటి వరకు ఎవరూ తీయని విధంగా ఉలిక్కిపడ్డ ఉప్పాడ చిత్రం నిర్మించామన్నారు. కథకు న్యాయం చేసే నటీనటులు ఇందులో నటించారని, ప్రేక్షకులకు వినోదం పంచుతుందన్నారు.
ప్రతీ కుటుంబంలో జరిగే సంఘటనలు చిత్రంలో ఉన్నాయన్నారు. చిన్న బడ్జెట్లో అత్యుత్తమ విలువలతో తీసిన సినిమా అని, మత్స్యకారుల జీవితాలు ప్రతిబింబించే కధాoశంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు.
మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలు తెలియజెప్పే సందేశం ఇందులో ఇమిడి ఉందన్నారు. స్థానిక మత్స్యకారులు ఎంతో సహకరించారని, కొత్తవారికి, ముఖ్యంగా స్థానిక నటులకు ఇందులో ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రతిఒక్కరు వారి పాత్రలకు న్యాయం చేశారని, చిన్న బడ్జెట్లో పెద్ద సినిమా ఉలిక్కిపడ్డ ఉప్పాడ అన్నారు. ప్రతిఒక్కరు ఈ చిత్రాన్ని ఆదరించి ప్రోత్సహించాలన్నారు. ఇందులోని నటులకు అవార్డు రావడానికి అవకాశాలు ఉన్నాయని ఆశాభావంను గౌతంరాజు వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో దర్శకుడు సాయికుమార్, నిర్మాత ఉదయ్ కిరణ్, నటులు నైనా, స్నేహ, డీఎస్ఎల్వి ప్రసాద్, సాయి ప్రసాద్ తదితరులు ప్రసంగించారు….


