Sunday, September 8, 2024

కేబినెట్ పై కుదరని ఏకాభిప్రాయం

- Advertisement -

హైదరాబాద్, డిసెంబర్ 6, (వాయిస్ టుడే):  తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా రెండో శాసనసభను రద్దు చేసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అనుకూలంగా ఎన్నికల సంఘం నివేదికతో గెజిట్‌ కూడా విడుదల అయింది. ఉదయం నుంచి దర్భార్‌ హాల్‌లో ప్రమాణస్వీకారం కోసం కావాల్సిన సరంజామా కూడా సిద్ధం చేశారు. ఇక, ప్రకటన వస్తుందని అనుకుంటున్న సమయంలో సీన్ మారింది. ఎమ్మెల్యే అభ్యర్ధుల సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని అధిష్టానానికి అప్పగించారు ఎమ్మెల్యేలు. సీఎల్పీ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు విషయాన్ని ఢిల్లీ పెద్దలకు పంపారు.అటు కొత్త సీఎం కాన్వాయ్‌ రెడీ చేశారు. మంత్రివర్గానికి అవసరమైన వాహనాలు కూడా సిద్ధం చేశారు. కానీ కాంగ్రెస్‌ మార్క్ రాజకీయంతో సీఎం ఎవరు అనేది నిర్ణయం జరగడం లేదు. తెలంగాణలో సీనియర్ల మధ్య పోటీ ఉండటంతో పార్టీ అధిష్టానం మరోసారి సంప్రదింపుల ద్వారానే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు హస్తిన బాట పట్టారు.ఇప్పటికే సీఎంగా రేవంత్‌రెడ్డికి అధిష్టానం నుంచి లైన్‌ క్లియర్‌ వచ్చినప్పటికీ, డిప్యూటీ సీఎం, కీలక శాఖలు, స్పీకర్ పదవిపైనే పీటముడి వీడటం లేదు. పీసీసీ అధ్యక్ష పదవిపైనా సందిగ్ధత వీడటం లేదు. సీఎం పదవి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశమిస్తే, పీసీసీ చీఫ్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి పదవులు ఎస్సీ, బీసీలకు ఇద్దామని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లు సమాచారం. ఈక్రమంలోనే కీలక శాఖలపైనా సీనియర్ నేతలు పట్టుబడుతుంటంతో ఏకాభిప్రాయం పొసగడం లేదుఇదిలావుంటే బీసీ కోటాలో తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్‌ కోరుతున్నారు. అటు మొదటి నుంచి సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి అయితే ఒకే, లేదంటే సింగిల్‌ డిప్యూటీ సీఎం పోస్ట్ ఉండాలంటున్నారు భట్టి. ఒక్కటే డిప్యూటీ సీఎంతో పాటు కీలక శాఖపై భట్టి పట్టుపడుతున్నారు.మరోవైపు డిప్యూటీ వద్దంటే స్పీకర్‌ పదవి తీసుకోవాలని భట్టికి హైకమాండ్‌ సూచినట్లు తెలుస్తోంది. ఒకవేళ భట్టి విక్రమార్క స్పీకర్‌ ఛైర్‌ వద్దంటే మంథని నుంచి గెలుపొందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అసెంబ్లీ స్పీకర్ పదవి కట్టబెట్టె ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇంతకాలం సీఎం పదవి కోసం ఎదురుచూస్తున్న మాజీ పీసీసీ చీఫ్, హజూర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, తనకు సీఎం ఇవ్వకపోతే తన సతీమణికి మంత్రిపదవి ఇవ్వాలంటున్నట్లు తెలుస్తోంది. ఇది అట్ల ఉంటే తెలంగాణలో పదవుల పంచాయితీ తేలకపోవడంతో హస్తిన బాట పట్టారు పార్టీ అబ్జర్వర్లు.తెలంగాణ కేబినెట్ కూర్పు కొలిక్కి రాకపోవడంతో పార్టీ ముఖ్యనేతలను అధిష్టానం ఢిల్లికి పిలుపించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం క్లియరెన్స్‌ కోసం తెలంగాణ నేతలు ఎదురుచూపులు చూస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్